IVF Sperm Donor Myths: చాలామందిలో ఉండే సాధారణ భయం IVF (In Vitro Fertilization) ట్రీట్‌మెంట్ సమయంలో “వేరే వ్యక్తి స్పెర్మ్ లేదా ఎగ్ ఉపయోగించబడతాయా?” అనే సందేహం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది. దీనిపై క్లారిటీ ఇవ్వడం చాలా ముఖ్యం.
IVF లో వేరేవాళ్ల స్పెర్మ్ వాడతారా?
సాదారణంగా వివాహిత జంటలకై చేసే IVF ట్రీట్మెంట్‌లో, వారి తమ స్వంత స్పెర్మ్ మరియు ఎగ్ లతోనే ప్రాసెస్ చేయబడుతుంది. వేరే వ్యక్తుల స్పెర్మ్ లేదా ఎగ్ వాడే అవకాశమే ఉండదు కస్టమర్ యొక్క స్పష్టమైన అవగాహన మరియు అనుమతి లేకుండా.
అయితే వేరే స్పెర్మ్ ఎప్పుడు వాడతారు?
1. స్పెర్మ్ డోనర్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే - ఉదాహరణకు, మగవారి స్పెర్మ్ కౌంట్ పూర్తిగా నిల్ అయినప్పుడు (Azoospermia), డాక్టర్ డోనర్ స్పెర్మ్ అవసరం ఉన్నట్లు సూచిస్తారు. అయితే పేషెంట్, భార్య మరియు భర్త రెండింటి లిఖితపూర్వక అంగీకారం తప్పనిసరిగా తీసుకుంటారు.
2. ఎగ్ డోనర్ కూడా అలాగే - ఒక మహిళకు ఎగ్ విడుదల కాకపోతే లేదా వయస్సు ఎక్కువైతే డోనర్ ఎగ్ సూచిస్తారు. కానీ ఇది పూర్తిగా పేషెంట్ అంగీకారం మీదే ఆధారపడుతుంది.
మిక్స్-అప్ (Mix-up) ప్రమాదం ఉందా?
- IVF ల్యాబ్స్ లో ప్రతి ఒక్కరి స్పెర్మ్, ఎగ్ లకు ప్రత్యేకంగా లేబులింగ్ ఉంటుంది.
- చాలా స్టెరిలైజ్డ్, హై-సెక్యూరిటీ ల్యాబ్స్ లో ఇది జరుగుతుంది.
- Double verification, witness system, bar-code tagging వంటివి వాడతారు.
- ఈ entire process చాలా sensitive and error-proof గా ఉంటుంది.
మీ స్పెర్మ్ లేదా ఎగ్ మిక్స్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. మీ అనుమతి లేకుండా వేరే స్పెర్మ్ వాడే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. IVF ట్రీట్మెంట్ టోటల్‌గా ట్రాన్స్‌పరెంట్ మరియు సెక్యూర్ గా ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా డాక్టర్‌ను నేరుగా అడగడం ఉత్తమం. కావున.. ఈ భయాలు ఆందోళనలు పక్కనపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్లొచ్చు.
Also Read: డబుల్ ఇన్‌కమ్ - నో కిడ్స్ అనే ట్రెండ్ ఇక ఆపండి!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS