IVF Injections: IVF అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది - ఇంజెక్షన్లు. ఆ ఇంజెక్షన్లను చూసి భయపడేవాళ్లు కొద్దిమందికాదు. “ఈ ట్రీట్‌మెంట్ నిజంగా నరకమే” అనిపించేది చాలా సాధారణం. కానీ అసలు విషయం ఏంటంటే… మనం భయపడేది తెలియకపోవడం వల్ల. ఒకసారి అవి ఎందుకో, ఎలా వుంటాయో అర్థమైతే… ఆ భయం మాయం అవుతుంది.
IVF లో ఇంజెక్షన్ల అవసరం ఎందుకు వస్తుంది? మొదటగా, ఒక నెలలో ఒక్క అండం పక్వం కాకుండా - మందుల సహాయంతో (ఇంజెక్షన్ల ద్వారా) ఎక్కువ అండాల్ని ఉత్పత్తి చేయడమే doctors లక్ష్యం. దీనిని ఒవ్యూలేషన్ ఇండక్షన్ అంటారు. వీటిలో ఎక్కువగా FSH అనే హార్మోన్ ఇంజెక్షన్లు వాడతారు.
అండాలు పెరిగిన తర్వాత వాటిని విడుదల చేయాలంటే, ట్రిగ్గర్ ఇంజెక్షన్ అవసరం. ఇది HCG అనే హార్మోన్ ద్వారా చేస్తారు. దీని తర్వాతే డాక్టర్‌గారు ఎగ్ రిట్రీవల్ చేస్తారు. రిట్రీవల్ తర్వాత బాడీకి గర్భధారణకు అవసరమైన హార్మోన్ సపోర్ట్ అవసరమవుతుంది. అందుకే ప్రొజెస్టెరోన్ ఇంజెక్షన్లు లేదా టాబ్లెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ పెద్ద సూదులతో వేసే ఇంజెక్షన్లే కావు. చాలా వరకు ఇవి సబ్‌క్యూటేనియస్ అంటే చర్మం కింద వేసే చిన్న, సన్నని సూదులే. కొన్ని కడుపు భాగంలో వేసినా… అవి ఒక చిన్న స్టింగ్ మాత్రమే. కొన్ని సెకన్లలోనే మానిపోతుంది. ఇవి ఇంట్లోనే వేయించుకోవచ్చు. కానీ ట్రెయిన్డ్ నర్స్ సాయం తీసుకోవడం మంచిది.
కాబట్టి IVF ఇంజెక్షన్లను “నరకం” అనడం అవసరం లేదు. అవి తాత్కాలికంగా అసౌకర్యంగా అనిపించినా, తావతా మాములుగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు.
Also Read: IVF లో వేరే వ్యక్తి స్పెర్మ్ వాడతారా? మీ సందేహాలకు క్లారిటీ ఇదే.!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility