Male Fertility Treatments: మగవారి ఇన్‌ఫెర్టిలిటీ అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపించే సమస్యగా మారింది. జీవనశైలి మార్పులు, ఒత్తిడులు, ఫుడ్ హాబిట్స్, హార్మోనల్ అసమతుల్యత, వృద్ధాప్యం వంటి అనేక కారణాల వలన స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, స్పెర్మ్ క్వాలిటీ పడిపోవడం జరుగుతోంది. దాంతో గర్భధారణకు ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వైద్య శాస్త్రంలో వచ్చిన అభివృద్ధుల వల్ల ఇప్పుడు ఎన్నో ఆధునిక చికిత్సల ద్వారా మగవారి ఇన్‌ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ఇలాంటి పరిష్కారాల్లో ముఖ్యమైనవి IUI, IVF, ICSI లాంటి అసిస్టెడ్ రిప్రొడక్షన్ టెక్నాలజీస్. వీటిలో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా వేర్వేరు సమస్యలకు, వేర్వేరు పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మగవారి ఇన్‌ఫెర్టిలిటీ తీవ్రతను బట్టి, స్పెర్మ్ ప్యారామీటర్లను బట్టి తగిన చికిత్సను ఎంచుకోవడం అవసరం. ఈ ట్రీట్మెంట్ల ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో గర్భధారణ సాధ్యమవుతుందో తెలుసుకోవడం ముఖ్యం.
Also Read: ఆనల్ శృగారం చేయవచ్చా?
ఇప్పుడు ఈ ఆధునిక చికిత్సలు ఎవరికెప్పుడు అవసరం అవుతాయో, అవి ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం.
- హార్మోన్ థెరపీ (Hormone Therapy): హార్మోన్ అసమతుల్యత వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తక్కువగా ఉంటే, టెస్టోస్టెరాన్, FSH, LH వంటి హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి మందులు లేదా ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. ఇది స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ మెరుగుపరిచే అవకాశం కలిగిస్తుంది.
- యాంటీబయోటిక్ ట్రీట్మెంట్: జననాంగాలలో ఇన్‌ఫెక్షన్ వల్ల ఫెర్టిలిటీకి అంతరాయం ఏర్పడినప్పుడు, యాంటీబయోటిక్స్ ద్వారా ఆ ఇన్‌ఫెక్షన్‌ను తొలగించడంతో పాటు స్పెర్మ్ హెల్త్‌ను రికవర్ చేస్తారు.
- ఆంటీ ఆక్సిడెంట్ థెరపీ & సప్లిమెంట్స్: విటమిన్ C, E, జింక్, సెలీనియం లాంటి ఆంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ క్వాలిటీ, మోటిలిటీ మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల స్పెర్మ్ దెబ్బతినకుండా రక్షిస్తాయి.
- ఫెర్టిలిటీ అసిస్టెడ్ టెక్నాలజీస్ (IUI, IVF, ICSI): ఇతర సాధారణ ట్రీట్మెంట్స్ ఫలితం ఇవ్వకపోతే, స్పెర్మ్ మోతాదు తక్కువగా ఉన్నా లేదా స్పెర్మ్ కదలిక లోపించినా, ఈ టెక్నాలజీలు ఉపయోగించబడతాయి. ICSI అనేది తీవ్రమైన ఇన్‌ఫెర్టిలిటీకి సరికొత్త పరిష్కారం.
- శస్త్రచికిత్స (Surgical Treatment): వేరికోసెల్, బ్లాకేజెస్ వంటి ఫిజికల్ సమస్యల వల్ల స్పెర్మ్ రాక అడుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మైనర్ సర్జరీ ద్వారా వాటిని తొలగించి ఫెర్టిలిటీని రీస్టోర్ చేయొచ్చు.
ఈ ట్రీట్మెంట్ల ఎంపిక వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, స్పెర్మ్ టెస్ట్ రిజల్ట్స్, హార్మోన్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. కనుక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షల తరువాత సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.
Also Read: పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గడానికి కారణమయ్యే 6 జీవనశైలి అలవాట్లు!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility