What is PESA Procedure: PESA అంటే Percutaneous Epididymal Sperm Aspiration. ఇది పురుషుల ఫెర్టిలిటీ చికిత్సల్లో భాగంగా చేసే ఒక చిన్న మెడికల్ ప్రొసీజర్. కొంతమందిలో వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం (Azoospermia) వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో, శరీరంలో లోపల స్పెర్మ్ ఉత్పత్తి అయ్యి.. కానీ బయటికి రాకపోతే, స్పెర్మ్‌ను నేరుగా వృషణానికి దగ్గరగా ఉన్న ఎపిడిడిమిస్ నుంచి సేకరించాల్సి వస్తుంది. దీన్నే PESA ద్వారా చేస్తారు.
![]() |
PESA Procedure |
ఈ ప్రక్రియ సాధారణంగా లోకల్ అనస్థీషియాతో outpatient (డే కేర్ ప్రొసీజర్) విధానంలో జరుగుతుంది. స్పెర్మ్ సేకరణకు శస్త్రచికిత్స అవసరం లేకుండా చిన్న సూదితో ఎపిడిడిమిస్‌ను టార్గెట్ చేస్తారు. ఇది సాధారణంగా కేవలం 20–30 నిమిషాల్లో పూర్తవుతుంది. ఈ స్పెర్మ్‌ను IVF లేదా ICSI వంటి టెక్నాలజీల్లో ఉపయోగిస్తారు.
PESA ముఖ్యంగా obstructive azoospermia ఉన్న వ్యక్తులకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ చాలా సురక్షితంగా ఉండే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. అయితే, ప్రతి పురుషుడి పరిస్థితి ఒక్కటే కాదనీ, ముందు పూర్తి ఫెర్టిలిటీ ఎవాల్యూయేషన్ అనంతరం డాక్టర్ సలహాతో మాత్రమే PESA చేయించాలి. PESA ద్వారా సేకరించిన స్పెర్మ్ ఫ్రెష్ గా కానీ లేదా ఫ్రీజ్ చేసి తరువాత అయినా ఉపయోగించుకోవచ్చు.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility