Female Infertility Causes: హార్మోన్ల అసమతుల్యత - మహిళలలో గర్భధారణకు హార్మోన్లు కీలకం. ఈ హార్మోన్ల సమతుల్యత లోపించినప్పుడు ఒవల్యూషన్ (అండం విడుదల) ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా పిసి ఓ డి (PCOD/PCOS) వంటి పరిస్థితుల్లో శరీరంలో ఆండ్రోజన్ (పురుష హార్మోన్) స్థాయి పెరిగిపోతుంది. దాంతో రెగ్యులర్‌గా అండాలు విడుదల కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
![]() |
Female Infertility Causes |
ఎండోమెట్రియోసిస్: ఇది ఒక మేజర్ గైనకాలజికల్ సమస్య. గర్భాశయం లోపలి పొర (ఎండోమెట్రియం) బయట ఉన్న ఇతర అవయవాలపై పెరిగితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తక్కువగా అండాలు ఉత్పత్తి అవ్వడానికీ, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ కావడానికీ దారితీస్తుంది. ఈ పరిస్థితిలో నొప్పితో పాటు గర్భధారణ కష్టంగా మారుతుంది.
ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజెస్: గర్భధారణ జరుగటానికి అండం మరియు స్పెర్మ్ ఫాలోపియన్ ట్యూబ్‌లో కలవాలి. కానీ ఇన్‌ఫెక్షన్లు, పూర్వ శస్త్రచికిత్సల వల్ల ట్యూబ్ బ్లాక్ అయితే గర్భధారణ జరగదు. దీన్ని సాధారణంగా HSG స్కాన్ లేదా లాపరోస్కోపీ ద్వారా గుర్తిస్తారు.
Also Read: IVF చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
థైరాయిడ్ మరియు ప్రోలాక్టిన్ సమస్యలు: థైరాయిడ్ హార్మోన్‌లు శరీరంలోని అనేక ఫంక్షన్లను నియంత్రిస్తాయి. థైరాయిడ్ అధికం లేదా తక్కువగా ఉన్నప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది. అలాగే ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉన్నా గర్భధారణకు ఆటంకం కలుగుతుంది. వీటి నిర్ధారణకు బ్లడ్ టెస్టులు అవసరం.
జీవనశైలి, వయసు ప్రభావం: ధూమపానం, మద్యం తాగే అలవాటు, మానసిక ఒత్తిడి, ఎక్కువ బరువు లేదా చాలా తక్కువ బరువు కూడా హార్మోన్లపై ప్రభావం చూపించి గర్భసాధనను కష్టతరం చేస్తాయి. ఇక వయస్సు పెరిగినకొద్దీ గర్భధారణకు అవసరమైన అండాల నాణ్యత మరియు సంఖ్య తగ్గిపోతుంది. సాధారణంగా 35 సంవత్సరాల తరువాత గర్భధారణకు సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility