Male Fertility Boosting Foods: ఇప్పటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటివి మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. కానీ మంచి ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ స్పెర్మ్ క్వాలిటీని, కౌంట్‌ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇప్పుడు అలాంటి 5 సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
1. వాల్‌నట్స్ (Walnuts): వాల్‌నట్స్‌లో ఉన్న ఓమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను మెరుగుపరచి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహాయపడతాయి. ప్రతిరోజు వాల్‌నట్స్ తినడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది.
2. బూడిదగుమ్మడి గింజలు (Pumpkin Seeds): బూడిదగుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ హార్మోన్ల బ్యాలెన్స్‌కి ముఖ్యమైనది. ఇది స్పెర్మ్ ఉత్పత్తి పెంచడంతో పాటు, వాటి మొబిలిటీని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కొద్ది గింజలు తినడం అలవాటు చేసుకోవాలి.
Also Read: మైక్రో ఫ్లూయిడిక్స్ టెక్నిక్ అంటే ఏంటి?
3. దానిమ్మ (Pomegranate): దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహాయపడుతుంది. దానిమ్మను జ్యూస్ రూపంలో లేదా పండుగా తీసుకోవడం ఉత్తమం.
4. పాలకూర (Spinach): పాలకూరలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఫోలేట్ లోపం ఉన్నప్పుడు స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి పాలకూరను తరచూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి జరుగుతుంది.
5. డార్క్ చాక్లెట్ (Dark Chocolate): డార్క్ చాక్లెట్‌లో L-Arginine అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తప్రసరణ మెరుగుపరచి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహాయపడుతుంది. అయితే ఇది పరిమితంగా మాత్రమే తినాలి.
ఆహారపు అలవాట్లను మార్చడం ద్వారా స్పెర్మ్ కౌంట్‌ను సహజంగా మెరుగుపరచుకోవచ్చు. పై చెప్పిన ఫుడ్స్‌తో పాటు, తగినంత నీరు తాగడం, నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించడం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లను దూరం పెట్టడం కూడా చాలా ముఖ్యం.