IUI vs IVF vs ICSI for Men: మగవారి ఇన్‌ఫెర్టిలిటీకి సంబంధించిన చికిత్సలో IUI, IVF, ICSI ఎప్పుడు అవసరం అవుతాయి?

IUI vs IVF vs ICSI for Men: మగవారిలో ఇన్‌ఫెర్టిలిటీ లక్షణాలు కనిపించినప్పుడు మొదటగా వారికున్న సమస్య తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఎంచుకుంటారు. కొన్ని తక్కువ కేసుల్లో జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన డైట్, హార్మోన్ల ట్రీట్మెంట్ లేదా యాంటీబయోటిక్స్‌తో పరిష్కారం సాధ్యమవుతుంది. అయితే, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు లేదా మోటిలిటీ (చలనం) తక్కువగా ఉన్నప్పుడు, సంతానలేమి చికిత్సలలోకి అడుగుపెడతారు.

IUI vs IVF vs ICSI for Men

IUI (Intrauterine Insemination) ట్రీట్మెంట్ ను సాధారణంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పటికీ, గర్భసంచిక (ఫిమేల్) వైపు ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో శుభ్రంగా సేకరించిన స్పెర్మ్‌ను నేరుగా గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు, తద్వారా గర్భధారణ అవకాశం పెరుగుతుంది. ఇది మైల్డ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న మగవారికి మొదట ప్రయత్నించదగిన ఆప్షన్.

IVF (In Vitro Fertilization)స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా లేదా మోటిలిటీ ఉన్నా, లేదా IUI ట్రీట్మెంట్ ఫెయిలైనప్పుడు IVF అవసరం అవుతుంది. ఈ పద్ధతిలో స్త్రీ అండాన్ని శరీరానికి బయట స్పెర్మ్‌తో ఫెర్టిలైజ్ చేసి, అభివృద్ధి చెందిన ఎంబ్రియోను గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

ICSI (Intracytoplasmic Sperm Injection) అనేది IVF టెక్నిక్‌లో ఒక అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఇది స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా స్పెర్మ్ క్వాలిటీ చాలా దెబ్బతిన్నప్పుడు ఉపయోగించబడుతుంది. ఒక్కో ఎగ్‌లోకి నేరుగా ఒక్కో స్పెర్మ్‌ను ఇంజెక్ట్ చేస్తారు. ఇది ముఖ్యంగా అజోస్పెర్మియా, టెసా/పెసా ద్వారా స్పెర్మ్ సేకరణ చేసినవారికి ఉపయోగపడుతుంది.

మగవారి ఫెర్టిలిటీ సమస్య తీవ్రతను బట్టి IUI, IVF, ICSI లాంటి పద్ధతుల్ని డాక్టర్లు సూచిస్తారు. ప్రతి ట్రీట్మెంట్‌కు కూడా ప్రత్యేకమైన సూచనలు, ప్రయోజనాలు మరియు పరిమితులుంటాయి. అందుకే వ్యక్తిగత పరిస్థితిని బట్టి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సూచించిన మార్గాన్ని అనుసరించడం ఉత్తమం.

Also Read: సంతానం కలగాలంటే స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post