Fertility Tests for Couples: సంతానం లేని దంపతులకు చేసే ప్రాథమిక పరీక్షలు!

Fertility Tests for Couples: భార్య, భర్తలిద్దరూ పెళ్లి అయ్యి సంవత్సరం దాటినా తర్వాత కూడా సహజ రీతిలో గర్భం దాల్చకపోతే ఇంఫెర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ సమస్యగా పరిగణిస్తారు. ఇది భార్య, భర్త ఇద్దరిలో ఎవరికైనా ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల రావచ్చు. అందుకే, వైద్యులు ఇద్దరికి కొన్ని ప్రాథమిక పరీక్షలు సూచిస్తారు. ఈ పరీక్షల ద్వారా సమస్య ఎక్కడుందో, ఎలాంటి చికిత్స అవసరమో స్పష్టత వస్తుంది.

Fertility Tests for Couples

మహిళలకు చేసే ప్రాథమిక పరీక్షలు

1. బ్లడ్ టెస్టులు: హార్మోన్ల స్థాయిలు తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా FSH, LH, AMH, ప్రోలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్ (TSH) స్థాయిలను పరీక్షిస్తారు. వీటివల్ల అండోత్పత్తి (Ovulation) సక్రమంగా జరుగుతోందా లేదా అనేది అర్థమవుతుంది.

2. ఓవ్యులేషన్ ట్రాకింగ్: అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మహిళలలో అండాలు ఎలా పక్వం అవుతున్నాయి, ఎప్పుడు అండం విడుదల అవుతోంది అనే విషయం తెలుసుకుంటారు. దీనిని Follicular Study అంటారు.

3. అల్ట్రాసౌండ్ స్కాన్: గర్భాశయం (Uterus), గర్భకోశాలు (Ovaries), ఫాలోపియన్ ట్యూబ్స్ (Fallopian Tubes) లో ఏమైనా సమస్యలున్నాయా అనేది స్కాన్ ద్వారా గుర్తిస్తారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లేదా సిస్టులు ఉన్నాయా అనేది ఈ స్కాన్ ద్వారా తెలుస్తుంది.

4. HSG (హిస్టరోసాల్పింగోగ్రామ్) టెస్ట్: ఇది ప్రత్యేకమైన ఎక్స్-రే పరీక్ష. గర్భాశయం మరియు ఫలాపి ట్యూబ్స్‌లో బ్లాక్‌లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చేస్తారు. ట్యూబ్స్ బ్లాక్ అయితే గర్భం సహజంగా దాల్చడం కష్టమవుతుంది.

Also Read: గర్భసంచి పొర టెస్ట్ ఎందుకు చేస్తారు?

Female Fertility Tests
Female Fertility Tests

పురుషులకు చేసే ప్రాథమిక పరీక్షలు

1. సెమన్ అనాలిసిస్ (Semen Analysis): ఇది పురుషులకి చేసే ముఖ్యమైన పరీక్ష. వీర్యకణాల సంఖ్య, కదలిక (Motility), ఆకారం (Morphology), నాణ్యత తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు.

2. హార్మోన్ టెస్టులు: టెస్టోస్టిరోన్, FSH, LH వంటి హార్మోన్ల స్థాయిలను పరీక్షించడం ద్వారా స్పెర్మ్ ఉత్పత్తి సక్రమంగా జరుగుతోందా లేదా తెలుసుకోవచ్చు.

3. అల్ట్రాసౌండ్ స్కాన్: వృషణాల్లో (Testes) లేదా వీర్యనాళాల్లో ఏమైనా సమస్యలున్నాయా అనేది తెలుసుకోవడానికి స్కాన్ చేస్తారు. ముఖ్యంగా వేరికోసెల్ (Varicocele) వంటి సమస్యలు ఇలాంటివి స్కాన్ ద్వారా బయటపడతాయి.

4. DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్: కొన్ని సందర్భాల్లో స్పెర్మ్ సంఖ్య, కదలిక బాగానే ఉన్నా కూడా గర్భం రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో స్పెర్మ్ DNA లో నష్టం ఉందా తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు.

Male Fertility Tests
Male Fertility Tests

దంపతులకు కలిపి చేసే పరీక్షలు

1. బ్లడ్ గ్రూప్ & Rh ఫాక్టర్ టెస్ట్: భార్య, భర్తల రక్త గ్రూపులు మరియు Rh ఫాక్టర్ తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు. Rh Incompatibility ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అవుతాయి.

2. ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ టెస్టులు: HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయా తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేస్తారు.

సంతానం లేని దంపతులకి ప్రాథమిక పరీక్షలు చాలా అవసరం. వీటితో సమస్య నిజంగా ఎక్కడుందో అర్థమవుతుంది. మహిళల్లో 40% కేసుల్లో, పురుషుల్లో 40% కేసుల్లో, మిగిలిన 20% కేసుల్లో ఇద్దరిలోనూ సమస్యలు ఉంటాయి. కాబట్టి పరీక్షలు ఒకరికి మాత్రమే కాకుండా, భార్యాభర్తలకు ఇద్దరికీ చేయించుకోవాలి. సకాలంలో డయగ్నోసిస్ చేసి చికిత్స ప్రారంభిస్తే, సంతాన సాఫల్యం సాధ్యమే.

Also Read: బేబీ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అలవాట్లు మానుకోండి

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post