Alcohol Smoking and Reproductive Health: పురుషులలో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్న ప్రధాన కారణాలలో స్మోకింగ్ మరియు ఆల్కహాల్ వినియోగం ముందంజలో ఉంటాయి. చాలా మంది యువత "స్మోక్, డ్రింక్ కొంచెం చేస్తే పెద్ద సమస్యేమీ రాదు" అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, వీటి ప్రభావం నేరుగా స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్, మోటిలిటీ మీద పడుతుంది. ఈ విషయం పై Pozitiv Fertility Hyderabad లోని Dr. Shashant S (Surgeon & Andrologist) గారు వివరించారు.
స్మోకింగ్ (Smoking) వల్ల వచ్చే ప్రభావాలు
సిగరెట్, సిగార్ లేదా వేపింగ్ ద్వారా శరీరంలోకి వెళ్ళే నికోటిన్, టార్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కెమికల్స్ పురుషుల రీప్రొడక్టివ్ సిస్టమ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
- స్పెర్మ్ కౌంట్ తగ్గడం: తరచూ స్మోకింగ్ చేసే పురుషులలో వీర్యకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.
- స్పెర్మ్ మోటిలిటీ తగ్గడం: వీర్యకణాలు అండాన్ని చేరే వేగం తగ్గిపోతుంది, దాంతో ఫెర్టిలైజేషన్ అవకాశాలు తగ్గుతాయి.
- DNA డ్యామేజ్: స్మోకింగ్ వల్ల స్పెర్మ్‌ల DNA నష్టం చెందుతుంది. ఇది గర్భధారణకు ఆటంకం కలిగించడమే కాకుండా, పుట్టే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది.
- హార్మోన్ల అసమతుల్యత: స్మోకింగ్ వలన టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గి, లిబిడో మరియు స్పెర్మ్ ప్రొడక్షన్ రెండింటికీ హాని కలుగుతుంది.
ఆల్కహాల్ (Alcohol) వల్ల వచ్చే ప్రభావాలు
సోషల్ డ్రింకింగ్, తరచూ మద్యం సేవించడం కూడా పురుషుల ఫెర్టిలిటీ మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది.
- టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడం: ఆల్కహాల్ వలన లివర్ పనితీరు దెబ్బతిని, హార్మోన్ ప్రొడక్షన్‌లో అవాంతరాలు వస్తాయి.
- స్పెర్మ్ క్వాలిటీ పడిపోవడం: తరచూ మద్యం సేవించే వారికి వీర్యకణాలు బలహీనంగా మారి, అండాన్ని ఫెర్టిలైజ్ చేయలేకపోతాయి.
- ఎరెక్టైల్ డిస్ఫంక్షన్: ఎక్కువగా మద్యం సేవించడం వలన రక్త ప్రసరణ తగ్గి, లైంగిక సమస్యలు వస్తాయి.
- జెనెటిక్ రిస్క్: అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన స్పెర్మ్‌లో జెనెటిక్ డ్యామేజ్ జరుగుతుంది. ఇది గర్భధారణను కష్టతరం చేస్తుంది.
Also Read: మైక్రోసర్జికల్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఏమిటి?
కలిపి ప్రభావం - Smoking + Alcohol
స్మోకింగ్, ఆల్కహాల్ రెండింటినీ ఒకేసారి అలవాటు చేసుకున్నవారిలో ఇన్‌ఫెర్టిలిటీ రిస్క్ డబుల్ అవుతుంది. స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువైపోవడం, క్వాలిటీ బాగా పడిపోవడం, హార్మోన్ అసమతుల్యత రావడం వల్ల సహజ గర్భధారణ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి.
ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ లో సమస్య
IVF, ICSI, IUI వంటి ఆధునిక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే సమయంలో కూడా స్మోకింగ్, ఆల్కహాల్ వదిలిపెట్టకపోతే విజయావకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే, డాక్టర్ ఎన్ని మంచి పద్ధతులు ప్రయత్నించినా స్పెర్మ్ క్వాలిటీ బలహీనంగా ఉంటే గర్భధారణ కష్టతరం అవుతుంది.
Dr. Shashant సలహా
- స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. ఒక సిగరెట్ కూడా శరీరంలో హాని చేసే రసాయనాలు చేరుస్తుంది.
- మద్యం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. తరచుగా మద్యం సేవించే వారిలో ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం, తగిన నిద్ర.. ఇవి స్పెర్మ్ క్వాలిటీ మెరుగుపడటానికి సహాయపడతాయి.
స్మోకింగ్, ఆల్కహాల్ వలన కేవలం లివర్, లంగ్స్ మాత్రమే కాదు, పురుషుల ఫెర్టిలిటీ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. తల్లిదండ్రులు కావాలనుకునే ప్రతి పురుషుడు వీటిని పూర్తిగా దూరం పెట్టడం చాలా అవసరం. Pozitiv Fertility Hyderabad లోని Dr. Shashant S గారి మాటల్లో చెప్పాలంటే.. "స్మోక్, డ్రింక్ మానేయడం మీ ఆరోగ్యానికే కాదు, మీ భవిష్యత్తు కుటుంబానికీ ఒక పెద్ద బహుమతి."
Also Read: బైక్ నడపడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Andrology Hyderabad