Egg Retrieval Process: మాతృత్వం అనే అద్భుతాన్ని అనుభవించాలని ఆశించే అనేక దంపతులకు IVF (In Vitro Fertilization) ఒక గొప్ప వరం. IVF ట్రీట్మెంట్ లో అత్యంత కీలకమైన దశల్లో ఒకటి Egg Retrieval Process. అంటే, మహిళల అండాశయాల (Ovaries) నుండి పక్వమైన అండాలను (Mature Eggs) సేకరించడం. డా. శశి ప్రియ గారు, Pozitiv Fertility Centre, Hyderabad లో ఈ ప్రాసెస్ ని వివరించారు.
1. Egg Retrieval అంటే ఏమిటి?
Egg Retrieval అనేది IVF చికిత్సలో ముఖ్యమైన దశ. గర్భాశయం లో సహజంగా విడుదలయ్యే ఒకటి లేదా రెండు అండాల బదులు, IVF లో ఎక్కువ అండాలు అవసరం అవుతాయి. అందుకోసం హార్మోన్ల సహాయంతో అండాలను పక్వం చేసి, వాటిని ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా బయటకు తీస్తారు. వీటిని శుక్రకణాలతో కలిపి ల్యాబ్ లో fertilization చేస్తారు.
Also Read: IVF చేయించుకోవడానికి ఎంత వయసు ఉండాలి!
2. అండాలు పక్వం అయ్యే విధానం
- Egg Retrievalకి ముందు, మహిళకు కొన్ని రోజుల పాటు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటివల్ల ఒకేసారి అనేక ఫాలికల్స్ (Follicles) అభివృద్ధి చెందుతాయి.
- ప్రతి ఫాలికల్ లో ఒక అండు పెరుగుతుంది.
- డాక్టర్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్, రక్త పరీక్షల ద్వారా అండాలు పక్వం అయ్యాయా లేదా అన్నది చెక్ చేస్తారు.
- సరైన సైజ్ కి వచ్చినప్పుడు Trigger Injection ఇస్తారు. ఇది అండాలను పూర్తి పక్వం చేయడానికి సహాయపడుతుంది.
3. Egg Retrieval ప్రాసెస్ ఎలా జరుగుతుంది?
- Trigger Injection ఇచ్చిన 34–36 గంటల తర్వాత Egg Retrieval చేస్తారు. ఇది ఒక సాధారణ, సేఫ్ ప్రొసీజర్.
- అనస్థీషియా ఇస్తారు. కాబట్టి ప్రాసెస్ సమయంలో ఎలాంటి నొప్పి అనిపించదు.
- ఒక ప్రత్యేకమైన సూది (Fine Needle) ను అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో వజైన ద్వారా అండాశయాల వరకు తీసుకెళ్తారు.
- ప్రతి ఫాలికల్ లో ఉన్న ద్రవాన్ని బయటకు తీస్తారు. ఆ ద్రవంలో పక్వమైన అండాలు ఉంటాయి.
- ఈ అండాలను వెంటనే ఎంబ్రియాలజిస్ట్ ల్యాబ్ లో సేకరిస్తారు.
- ఈ మొత్తం ప్రాసెస్ సాధారణంగా 20–30 నిమిషాలు మాత్రమే పడుతుంది.
4. Egg Retrieval తర్వాత ఏమవుతుంది?
- ప్రాసెస్ పూర్తయ్యాక, పేషేంట్ 1–2 గంటల పాటు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకోవాలి.
- కొంతమందికి స్వల్పమైన నొప్పి, కడుపు ఉబ్బరం (bloating), లేదా తేలికపాటి రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణమే.
- సేకరించిన అండాలను శుక్రకణాలతో కలిపి fertilization చేస్తారు. తరువాత ఆరోగ్యకరమైన ఎంబ్రియోస్ (Embryos) ను తయారు చేస్తారు.
- ఈ ఎంబ్రియోస్ లో మంచి క్వాలిటీ ఉన్నవాటిని ఎంచుకొని తరువాత గర్భాశయంలోకి బదిలీ (Embryo Transfer) చేస్తారు.
5. Egg Retrieval లో జాగ్రత్తలు
- డాక్టర్ సూచించిన మందులు, ఇంజెక్షన్లు సరిగ్గా తీసుకోవాలి.
- ప్రాసెస్ కి ముందు భోజనం చేయకూడదు.
- ప్రాసెస్ తరువాత బాగా నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది.
- ఎలాంటి అసహజ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ కి తెలియజేయాలి.
Egg Retrieval Process అనేది IVF లో అత్యంత ముఖ్యమైన మరియు సాంకేతికతతో కూడిన దశ. దీని ద్వారా పక్వమైన అండాలను సేకరించి, తల్లిదండ్రుల కల అయిన బిడ్డ పుట్టే ప్రయాణంలో ముందడుగు వేస్తారు. డా. శశి ప్రియ గారు చెప్పినట్లుగా, ఇది ఒక సురక్షితమైన, సాధారణ ప్రాసెస్, కానీ దీన్ని కచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.
Also Read: స్మోకింగ్, వేపింగ్ చేసేవాళ్లకు సహజంగా పిల్లలు పుట్టరా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility