IVF Baby Growth Journey: బిడ్డ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాకపోతే చాలామంది IVF వైపు వెళ్తారు. అయితే ఈ ట్రీట్మెంట్ లో బిడ్డ ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. అది దశలవారీగా ఇలా జరుగుతుంది.
అండాలు సేకరించడం: మొదటగా మహిళకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి ఒకేసారి ఒకటి కాక, అనేక అండాలు తయారయ్యేలా చేస్తాయి. అవి రెడీ అయిన తర్వాత డాక్టర్లు వాటిని చిన్న ప్రొసీజర్ ద్వారా తీసేస్తారు.
స్పెర్మ్స్ సేకరించడం: పురుషుడి నుండి వీర్యాన్ని తీసుకుని, అందులో ఉన్న ఆరోగ్యకరమైన స్పెర్మ్స్ మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి అండాలతో కలపడానికి సిద్ధం చేస్తారు.
ఫర్టిలైజేషన్: ల్యాబ్‌లో అండాలు మరియు స్పెర్మ్స్ కలిపి ఫర్టిలైజేషన్ చేస్తారు. అంటే స్పెర్మ్ అండం లోకి వెళ్లి, ఎంబ్రియోగా మారుతుంది. ఇది బిడ్డ పుట్టడానికి మొదటి స్టెప్.
ఎంబ్రియో పెంపకం: ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఎంబ్రియోను ల్యాబ్‌లో 3–5 రోజుల వరకు పెంచుతారు. ఈ సమయంలో అది క్రమంగా వృద్ధి చెందుతూ బలంగా తయారవుతుంది.
ఎంబ్రియో ట్రాన్స్ఫర్: చివరగా ఆరోగ్యకరమైన ఎంబ్రియోను ఎంచుకుని మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఎంబ్రియో సక్సెస్‌ఫుల్‌గా అతుక్కుంటే గర్భధారణ మొదలవుతుంది.
IVF ట్రీట్మెంట్ అనేది సురక్షితమైన, ఆధునిక వైద్య సాంకేతికత. సహజంగా గర్భధారణ సాధ్యం కాకపోయినా, దీని ద్వారా చాలా మంది తల్లిదండ్రుల కలలు నిజమవుతున్నాయి.
Also Read: ట్యూబ్ బ్లాకేజ్ కి చికిత్స ఎలా చేస్తారు?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility