IVF Treatment Age Limit: ఇంఫెర్టిలిటీ (Infertility) సమస్యలు పెరుగుతున్న ఈ రోజుల్లో, IVF (In Vitro Fertilization) పద్ధతి అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. అయితే చాలామందికి ఒకే ఒక్క సందేహం ఉంటుంది.. “IVF చేయించుకోవడానికి ఎంత వయస్సు ఉండాలి?” అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, వయస్సు మరియు ఫర్టిలిటీ (Fertility) మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
![]() |
IVF Treatment Age Limit |
వయస్సు మరియు స్త్రీల ఫర్టిలిటీ: స్త్రీల ఫర్టిలిటీ 20ల వయస్సులో అత్యధికంగా ఉంటుంది. 30 ఏళ్లు దాటిన తరువాత ఎగ్స్ నాణ్యత, సంఖ్య తగ్గిపోతాయి. 35 ఏళ్లు దాటిన తరువాత ఈ తగ్గుదల వేగంగా జరుగుతుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత సహజంగా గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువవుతాయి. ఈ కారణంగానే IVF పద్ధతి వయస్సుతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.
IVF కోసం సరైన వయస్సు
- 20-30 సంవత్సరాలు: ఈ వయస్సులో IVF సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్ నాణ్యత బాగుంటుంది కాబట్టి గర్భధారణకు అవకాశం ఎక్కువ.
- 30-35 సంవత్సరాలు: ఈ వయస్సులో కూడా IVF సక్సెస్ రేట్ అయ్యే అవకాశాలు మంచి స్థాయిలో ఉంటాయి, అయితే 20లతో పోలిస్తే కొంత తగ్గుదల ఉంటుంది.
- 35-40 సంవత్సరాలు: ఈ వయస్సులో IVF సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. డాక్టర్లు సాధారణంగా ఈ వయస్సులో Egg Freezing లేదా Donor Eggs పద్ధతులను కూడా సూచించవచ్చు.
- 40 సంవత్సరాల తర్వాత: సహజ గుడ్డులతో IVF సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ దశలో డాక్టర్లు Donor Eggs (ఇతర మహిళల ఎగ్స్) ఉపయోగించమని సిఫారసు చేయవచ్చు.
Also Read: IVF ట్రీట్మెంట్ లో బిడ్డ ఎలా పెరుగుతుందో చూడండి!
![]() |
Maximum age for IVF treatment |