Embryo Transfer Successful Symptoms: IVF (In-Vitro Fertilization) చికిత్సలో అత్యంత కీలకమైన దశ పిండం (Embryo) బదిలీ చేయడం. ల్యాబ్‌లో అభివృద్ధి చెందిన పిండాన్ని గర్భాశయంలోకి బదిలీ చేసిన తర్వాత ప్రతి దంపతులూ ఆతృతగా ఎదురు చూసే సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శరీరంలో కొన్ని మార్పులు, లక్షణాలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా లక్షణాలు కనిపించవు. ఇవి సహజమైన మార్పులా, లేక గర్భధారణకు సంకేతాలా అన్న అనుమానం సాధారణమే. కాబట్టి IVF లో పిండం బదిలీ తర్వాత సాధారణంగా కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం.
![]() |
| Embryo Transfer Successful Symptoms |
1. తేలికపాటి రక్తస్రావం లేదా స్పాటింగ్
పిండం గర్భాశయంలో స్థిరపడే సమయంలో కొద్దిగా రక్తస్రావం (Implantation Bleeding) జరగవచ్చు. ఇది సాధారణంగా పింక్ లేదా బ్రౌన్ కలర్‌లో కనిపిస్తుంది. అయితే ఇది ఎల్లప్పుడూ జరగకపోవచ్చు, కొన్ని మహిళలకు మాత్రమే తేలికపాటి స్పాటింగ్ కనిపిస్తుంది.
2. కడుపు నొప్పి లేదా క్రాంప్స్
పిండం బదిలీ చేసిన తర్వాత, గర్భాశయం కొత్త పిండాన్ని ఆమోదించే క్రమంలో స్వల్ప నొప్పి లేదా క్రాంప్స్ రావచ్చు. ఇది పీరియడ్స్ వచ్చే సమయంలో అనిపించే నొప్పిలా ఉంటుంది. సాధారణంగా ఇది తేలికపాటి నొప్పి మాత్రమే ఉంటుంది.
3. అలసట మరియు బలహీనత
హార్మోన్ల మార్పుల కారణంగా చాలా మహిళలు అలసటగా, నిద్రమత్తుగా అనిపించుకోవచ్చు. ఇది శరీరం గర్భాన్ని అంగీకరించే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది.
4. వక్షోజాల్లో నొప్పి లేదా వాపు
పిండం బదిలీ తర్వాత వక్షోజాల్లో నొప్పి, వాపు లేదా నిగారింపు అనిపించవచ్చు. ఇది ముఖ్యంగా ప్రొజెస్టిరోన్ హార్మోన్ ఇంజెక్షన్లు లేదా మందుల వలన కూడా జరగవచ్చు.
5. వాంతులు
కొన్ని సందర్భాల్లో తేలికపాటి వాంతులు అవుతాయి. ఇది గర్భధారణకు ప్రారంభ సంకేతంగా కూడా భావించబడుతుంది, కానీ ప్రతీ ఒక్కరికి ఇది తప్పనిసరిగా జరగదు.
6. మూడ్ స్వింగ్స్ మరియు ఆందోళన
హార్మోన్ల మార్పులు మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆనందంగా, మరికొన్నిసార్లు ఆందోళనగా అనిపించడం సహజం. IVF లో ఉన్నవారికి ఈ భావోద్వేగాలు మరింత ఎక్కువగా ఉండొచ్చు.
7. తరచుగా మూత్ర విసర్జన అవసరం
గర్భాశయం మార్పులు, హార్మోన్ ప్రభావం కారణంగా కొన్ని మహిళలకు తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించవచ్చు.
8. లక్షణాలు లేకపోవడం కూడా సహజమే
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కొంతమంది మహిళలకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. దీని అర్థం IVF విఫలమైందని కాదు. లక్షణాలు లేకపోవడం కూడా పూర్తిగా సహజమే.
IVF లో పిండం బదిలీ తర్వాత కనిపించే లక్షణాలు ప్రతి ఒక్కరికీ వేరువేరుగా ఉంటాయి. ఇవి తప్పనిసరిగా గర్భధారణకు సంకేతాలన్న మాట కాదు. చివరికి గర్భధారణ విజయవంతమైందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ సూచించిన గర్భధారణ పరీక్ష (Beta-hCG Test) చేయించుకోవడం అత్యంత అవసరం. ఈ సమయంలో అధిక ఆందోళన, ఒత్తిడి వద్దు. విశ్రాంతి, సానుకూల ఆలోచనలు, డాక్టర్ సూచించిన మందులు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
Also Read: ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ఈ ఫుడ్స్ తప్పక తీసుకోండి!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility
