Sperm Composition: పురుషులలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్ అనేది సంతానోత్పత్తికి ముఖ్యమైన భాగం. వీర్యకణం (Sperm Cell) చాలా చిన్నదైనా, దాని లోపల ఒక కొత్త జీవం పుట్టడానికి కావాల్సిన ముఖ్యమైన సమాచారం మొత్తం ఉంటుంది. చాలా మంది "స్పెర్మ్ లో నిజంగా ఏముంటుంది?" అనే సందేహం పడుతుంటారు. ఇప్పుడు దాని నిర్మాణం, అందులో ఉండే పదార్థాలు, మరియు వాటి పనితీరును వివరంగా తెలుసుకుందాం.
స్పెర్మ్ యొక్క నిర్మాణం
స్పెర్మ్ కణం ఒక మైక్రోస్కోపిక్ సెల్, దీని పొడవు కేవలం 50 మైక్రోమీటర్స్ మాత్రమే.
ఇది మూడు ప్రధాన భాగాలుగా ఉంటుంది:
- హెడ్ (Head) - స్పెర్మ్ తల భాగం.
- మిడ్‌పీస్ (Midpiece) - మధ్య భాగం.
- టెయిల్ (Tail) - తోక భాగం.
హెడ్ (Head) లో ఏముంటుంది?
స్పెర్మ్ తల భాగంలో DNA ఉంటుంది. ఇది తండ్రి నుండి బిడ్డకు వెళ్ళే జన్యు సమాచారాన్ని (Genetic Material) మోసుకెళ్తుంది. అంటే, బిడ్డ యొక్క లింగం (ఆడ/మగ), శరీర లక్షణాలు, కొంతవరకు శారీరక, మానసిక స్వభావాలు కూడా ఇందులోని జీన్స్ ద్వారా నిర్ణయించబడతాయి.
హెడ్ లో Acrosome అనే కవచం ఉంటుంది. ఇది ఎంజైమ్స్ తో నిండిపొయి ఉంటుంది. వీటివల్ల స్పెర్మ్, అండాన్ని చేరుకునే సమయంలో దాని బయట పొర (Egg Membrane) ను దాటి లోపలికి ప్రవేశించగలదు.
మిడ్‌పీస్ (Midpiece) లో ఏముంటుంది?
స్పెర్మ్ మిడ్‌పీస్ లో Mitochondria ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తి కేంద్రాలు. స్పెర్మ్ ఎగ్ ను చేరుకోవడానికి పొడవు దూరం ఈదాలి కాబట్టి, దీని కోసం కావాల్సిన ఎనర్జీని మిడ్‌పీస్ అందిస్తుంది. ఇది లేకపోతే స్పెర్మ్ కదలలేడు.
టెయిల్ (Tail) లో ఏముంటుంది?
స్పెర్మ్ టెయిల్ అనేది వీర్యకణానికి కదలిక (Motility) ఇచ్చే భాగం. ఇది Flagellum లాగా పనిచేస్తుంది. టెయిల్ వల్లే స్పెర్మ్ ఒక ఈతగాడు (swimmer) లాగా ముందుకు కదులుతుంది. ఎగ్ ను చేరుకోవడానికి టెయిల్ అత్యంత అవసరం.
స్పెర్మ్ లో ఉండే రసాయనాలు
స్పెర్మ్ లో కేవలం DNA మాత్రమే కాదు, మరికొన్ని ముఖ్యమైన రసాయనాలు కూడా ఉంటాయి:
- ప్రోటీన్లు - వీటివల్ల స్పెర్మ్ శక్తివంతంగా ఉంటుంది.
- ఎంజైమ్స్ - అండం లోపలికి ప్రవేశించడంలో సహాయపడతాయి.
- క్రోమోసోమ్స్ - బిడ్డ లింగాన్ని నిర్ణయించేవి (X లేదా Y క్రోమోసోమ్).
స్పెర్మ్ లో లింగ నిర్ణయం ఎలా జరుగుతుంది?
స్పెర్మ్ లో X లేదా Y క్రోమోసోమ్ ఉంటుంది.
- స్పెర్మ్ లో X క్రోమోసోమ్ ఉంటే → అండంతో కలిసినప్పుడు ఆడబిడ్డ (XX) పుడుతుంది.
- స్పెర్మ్ లో Y క్రోమోసోమ్ ఉంటే → అండంతో కలిసినప్పుడు మగబిడ్డ (XY) పుడుతుంది.
అంటే బిడ్డ లింగం పూర్తిగా తండ్రి స్పెర్మ్ మీద ఆధారపడి ఉంటుంది.
స్పెర్మ్ అనేది చాలా చిన్న కణం అయినా, అది కొత్త జీవాన్ని సృష్టించే జీవన రహస్యం ను మోసుకుపోతుంది. హెడ్ లో DNA, మిడ్‌పీస్ లో శక్తినిచ్చే మైటోకాండ్రియా, టెయిల్ లో కదిలించే శక్తి.. ఇవన్నీ కలిసి ఒక అండాన్ని ఫర్టిలైజ్ చేసి బిడ్డ పుట్టడానికి మార్గం సుగమం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి కావడానికి సరైన ఆహారం, వ్యాయామం, ధూమపానం మరియు మద్యం నుండి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
Also Read: స్పెర్మ్ కౌంట్ పెంచే 10 సూపర్ ఫుడ్స్!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility