PGT Test Procedure: PGT టెస్ట్ ఎలా చేస్తారు?

PGT Test Procedure: గర్భధారణలో లేదా IVF (In Vitro Fertilization) ప్రక్రియలో బిడ్డకు జన్యు సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు చేసే పరీక్షే PGT (Preimplantation Genetic Testing). ఇది ఒక అధునాతన టెక్నాలజీ టెస్ట్, ఇది బిడ్డ జన్యువులను పరీక్షించి, ఆరోగ్యకరమైన ఎంబ్రియోలను మాత్రమే గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ టెస్ట్ ఎలా చేస్తారో వివరంగా ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

PGT Test Procedure
PGT Test Procedure

1. IVF ప్రక్రియలో భాగంగా PGT
PGT టెస్ట్‌ను సాధారణంగా IVF చికిత్స సమయంలో చేస్తారు. మొదట ఆడవారిలో నుండి ఎగ్స్ సేకరించి, మగవారి స్పెర్మ్‌తో ల్యాబ్‌లో ఫర్టిలైజ్ చేస్తారు. ఫర్టిలైజేషన్ తర్వాత ఎంబ్రియోలు (భ్రూణాలు) ఏర్పడతాయి. ఇవి 5వ లేదా 6వ రోజు వరకు ల్యాబ్‌లో పెంచుతారు.

Also Read: HSG టెస్ట్ అంటే ఏంటి? ఎలా చేస్తారు?

2. ఎంబ్రియో బయాప్సీ (Embryo Biopsy)
ఎంబ్రియో 5వ రోజు “బ్లాస్టోసిస్ట్” దశలోకి చేరుకున్న తర్వాత, దానిలోని కొద్దిమంది సెల్స్‌ను మైక్రోస్కోప్ సహాయంతో జాగ్రత్తగా తీసేస్తారు. దీనినే బయాప్సీ అంటారు. ఈ చిన్న భాగాన్ని జన్యు పరీక్ష కోసం పంపిస్తారు, ఇక మిగతా ఎంబ్రియోను లిక్విడ్ నైట్రోజన్‌లో ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు.

3. జన్యు పరీక్ష (Genetic Analysis)
బయాప్సీ ద్వారా తీసిన సెల్స్‌ను ల్యాబ్‌లో NGS (Next Generation Sequencing) లేదా PCR (Polymerase Chain Reaction) వంటి ఆధునాతన టెక్నాలజీతో పరీక్షిస్తారు. 
ఈ పరీక్ష ద్వారా:
క్రోమోజోమ్ లోపాలు ఉన్నాయా?
జన్యు వ్యాధులు ఉన్నాయా?
ఎంబ్రియో నార్మల్‌గా ఉన్నదా లేదా? అని తెలుసుకోవచ్చు.

4. ఆరోగ్యకరమైన ఎంబ్రియో ఎంపిక
జన్యు పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వైద్యులు జన్యు లోపాలు లేని, ఆరోగ్యకరమైన ఎంబ్రియోను మాత్రమే గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. 
దీనివల్ల:
గర్భధారణ విజయవంతం అయ్యే అవకాశం పెరుగుతుంది
గర్భస్రావం అవకాశాలు తగ్గుతాయి
బిడ్డకు జన్యు వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

5. PGT చేసే సమయం
PGT టెస్ట్ సాధారణంగా ఈ పరిస్థితుల్లో చేస్తారు:
పూర్వంలో బిడ్డకు జన్యు వ్యాధులు ఉన్నప్పుడు
రెండు సార్లు లేదా అంతకంటే ఎక్కువ IVF ఫెయిల్ అయినప్పుడు
గర్భస్రావం పదేపదే జరిగే సందర్భాల్లో
తల్లి వయస్సు 35 ఏళ్లు దాటినప్పుడు
కుటుంబంలో జన్యు వ్యాధుల చరిత్ర ఉన్నప్పుడు

PGT టెస్ట్ ఒక ఆధునిక వైద్య పద్ధతి, ఇది భవిష్యత్తులో బిడ్డ ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించే సాంకేతికతగా చెప్పవచ్చు. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నా, దీని ద్వారా ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన గర్భధారణ సాధ్యమవుతుంది. మీకు ఈ టెస్ట్ అవసరమా కాదా అన్నది మాత్రం ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ లేదా గైనకాలజిస్ట్ సలహాతో నిర్ణయించుకోవడం మంచిది.


Post a Comment (0)
Previous Post Next Post