In Vitro Fertilisation (IVF) Process : IVF ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది? దశల వారిగా పూర్తి వివరణ | Pozitiv Fertility, Hyderabad

In Vitro Fertilisation (IVF) Process : ఓవరియన్ స్టిమ్యులేషన్ (Ovarian Stimulation) - ఈ దశలో మహిళకు హార్మోన్ ఇంజెక్షన్లు (FSH, LH) ఇస్తారు. ఇవి గర్భాశయంలో ఎక్కువ సంఖ్యలో అండాలు (eggs) పెరగడానికి సహాయపడతాయి. సాధారణంగా నెలకు ఒక్క ఎగ్ మాత్రమే తయారవుతుంది, కానీ IVF కోసం 8-10 అండాలు అవసరమవుతాయి. అందుకే స్పెషల్ మోనిటరింగ్ చేస్తారు, స్కానింగ్‌లు, బ్లడ్ టెస్టులతో ఎగ్ గ్రోత్‌ను ఫాలో అప్ చేస్తారు. 

ఎగ్ రిట్రీవల్ (Egg Retrieval): అండాలు పరిపక్వత చెందిన తర్వాత, ఒక చిన్న శస్త్రచికిత్స ద్వారా వాటిని గర్భాశయం నుంచి బయటకు తీస్తారు. దీనిని "Egg Pick Up" అంటారు. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్, ఎనస్తీషియా ద్వారా 15–20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఎగ్‌లు సేకరించి, IVF ల్యాబ్‌కి పంపిస్తారు.

స్పెర్మ్ కలెక్షన్ (Sperm Collection): అండాలను ఫెర్టిలైజ్ చేయడానికి, పురుషుని నుంచి స్పెర్మ్ సేకరిస్తారు. అవసరమైతే TESA/PESA వంటి ప్రత్యేక టెక్నిక్‌ల ద్వారా కూడా స్పెర్మ్ తీసుకుంటారు. శుద్ధి చేసిన స్పెర్మ్‌ను ఎంచుకుని ల్యాబ్‌లో అండాలతో కలిపే ప్రక్రియ మొదలవుతుంది.

Also Read: సహజంగా ప్రెగ్నెన్సీ రాకపోతే IVF ట్రీట్మెంట్ ఎలా సహాయపడుతుంది?

ఫెర్టిలైజేషన్ (Fertilization): ల్యాబ్‌లో ఎగ్ మరియు స్పెర్మ్‌లను కలిపి, ఫెర్టిలైజేషన్ కోసం 18-24 గంటల పాటు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచుతారు. ఇది సక్సెస్ అయితే ఎంబ్రియో ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ICSI పద్ధతిలో ఒక్కో స్పెర్మ్‌ను ఎగ్‌లోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు.

ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (Embryo Transfer): ఎంబ్రియో ఏర్పడిన 3వ లేదా 5వ రోజున, ఆరోగ్యవంతమైన ఎంబ్రియోను మహిళ గర్భాశయంలోకి ప్రవేశ పెట్టె ప్రక్రియ ఇది. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. అనెస్థీషియా అవసరం ఉండదు. ఆ తర్వాత రెండు వారాలు విశ్రాంతిగా ఉండాలని డాక్టర్ సూచిస్తారు.

గర్భధారణ టెస్ట్ (Pregnancy Test): ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత 12 నుంచి 14 రోజులకు బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఏర్పడిందా లేదా అని నిర్దారిస్తారు. ఇది IVF ట్రీట్మెంట్‌లో చివరి దశ.

Also Read: ఎగ్ ఫ్రీజింగ్ చేయించడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందా? 

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility


Post a Comment (0)
Previous Post Next Post