Egg Freezing Cost: ఎగ్ ఫ్రీజింగ్ చేయించడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందా? | Pozitiv Fertility, Hyderabad

Egg Freezing Cost: ఎగ్ ఫ్రీజింగ్ అనేది భావితరాల తల్లి కావాలనుకునే మహిళలకు ఒక గొప్ప అవకాశంగా మారింది. కానీ ఈ ప్రక్రియపై ఆలోచించే ప్రతీ ఒక్కరూ మొదటగానే అడిగే ప్రశ్న "ఇది ఎంత ఖర్చవుతుంది?" అదే సమయంలో, “ఈ ట్రీట్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?” అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఎగ్ ఫ్రీజింగ్‌కు సంబంధించిన ఖర్చులు, మెడికల్ ప్లాన్‌ ద్వారా వచ్చే సపోర్ట్ గురించి స్పష్టతగా తెలుసుకుందాం.

1. ఎగ్ ఫ్రీజింగ్ ఖర్చు ఎంత అవుతుంది: ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ మొత్తం ఖర్చు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఇది క్లినిక్ ఆధారంగా, నగరాన్ని బట్టి, వైద్యుల అనుభవాన్ని బట్టి మారవచ్చు. ఈ మొత్తంలో ఉండే ప్రధాన అంశాలు:

- హార్మోన్ ఇంజెక్షన్లు (Ovulation induction medication) – ₹50,000 వరకు

- అండాల రిట్రీవల్ ప్రాసెజ్ – ₹30,000 - ₹50,000

- అనస్తీషియా, ల్యాబ్ ఖర్చులు – ₹20,000 - ₹30,000

- ఎగ్స్ ఫ్రీజ్ చేసి భద్రపరచే ఖర్చు – సుమారుగా ₹15,000 - ₹25,000 ప్రతి సంవత్సరం (స్టోరేజ్ ఫీజు)

ఈ మొత్తం ఒక్క Egg Freezing cycleకి మాత్రమే. కొన్నిసార్లు తగిన ఎగ్స్ రావాలంటే 2 లేదా 3 సైకిళ్లు అవసరమవుతాయి. అప్పుడు ఖర్చు మరింత పెరుగుతుంది.

2. హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందా: భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్ ఫ్రీజింగ్‌కి సంబంధించి చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కవరేజ్ ఇవ్వవు. కారణం - ఇది Elective fertility preservationగా పరిగణించబడుతుంది, అంటే వ్యక్తిగత ఆప్షన్. ఆరోగ్య పరంగా అత్యవసర చికిత్సగా పరిగణించదు కాబట్టి ఎక్కువగా బీమా సంస్థలు దీనికి కవరేజ్ ఇవ్వవు. 

అయితే, కొన్ని కార్పొరేట్ కంపెనీలు (Tech companies, MNCs) తమ మహిళా ఉద్యోగులకు Fertility Benefits పేరుతో ప్రత్యేకంగా కవర్ చేయడం జరుగుతోంది. ఇందులో ఎగ్ ఫ్రీజింగ్ ఖర్చును మొత్తం లేదా కొంత వరకూ రీయింబర్స్ చేసే అవకాశముంటుంది. మీరు కంపెనీలో పనిచేస్తుంటే HR policies చెక్ చేయడం మంచిది.

Also Read: ఎగ్ ఫ్రీజింగ్‌కి ముందు మహిళలు చేయించాల్సిన మెడికల్ టెస్టుల లిస్ట్ 

3. ఎప్పుడు బీమా కవర్ అయ్యే అవకాశముంటుంది?

అసలు వైద్య కారణాల వల్ల ఎగ్ ఫ్రీజింగ్ అవసరమైతే..

ఉదాహరణకు:

- క్యాన్సర్ చికిత్స (Chemotherapy/ Radiation) తీసుకోవలసిన పరిస్థితుల్లో

- ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధుల వల్ల ఫెర్టిలిటీ దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు

ఈ సందర్భాల్లో Medical necessity గా పరిగణించబడే అవకాశం ఉంటుంది. అప్పుడు కొన్ని బీమా పాలసీలు పరిమిత మొత్తంలో కవర్ చేయవచ్చు. ఇది పూర్తిగా బీమా పాలసీ మీద ఆధారపడి ఉంటుంది.

4. ఖర్చును తగ్గించుకునే మార్గాలు ఉన్నాయా?

Government/NGO fertility clinics: కొన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు లేదా ట్రస్ట్ ఆధారిత IVF సెంటర్లు తక్కువ ధరకు సేవలు అందిస్తున్నాయి.

EMI options: చాలాచోట్ల EMI ద్వారా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Package plans: కొన్ని IVF క్లినిక్స్ Egg Freezing కోసం స్పెషల్ ప్యాకేజులు అందిస్తున్నాయి.

ఎగ్ ఫ్రీజింగ్ ఒక ఖరీదైన ప్రక్రియ అయినప్పటికీ, జీవితంలో భవిష్యత్ కోసం తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం. సాధారణంగా ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు అయ్యే ఖర్చు ₹1.5 లక్షల నుంచి ₹2.5 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో మందులు, స్కాన్లు, ల్యాబ్ ఛార్జీలు, మరియు స్టోరేజీ ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఇది ఒక ఎలక్టివ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కాబట్టి, ఎక్కువ భాగం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు దీన్ని కవర్ చేయవు. కొంతమంది కంపెనీలు ఉద్యోగుల కోసం ఫెర్టిలిటీ బెనిఫిట్స్ ఆఫర్ చేయవచ్చు. కాబట్టి ముందుగానే మీ పాలసీని ఓసారి స్పష్టంగా చదవడం, లేదా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదించడం చాలా అవసరం.

Also Read: ఎగ్ ఫ్రీజింగ్ సేఫ్‌నా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా ప్రమాదాలుంటాయి?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post