Egg Freezing Pros vs Cons: ఎగ్ ఫ్రీజింగ్ సేఫ్‌నా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా ప్రమాదాలుంటాయి? | Pozitiv Fertility, Hyderabad

Egg Freezing Pros vs Cons: ఎగ్ ఫ్రీజింగ్ అంటే భవిష్యత్తులో గర్భధారణ కోసం అండాలను భద్రపరచే ఆధునిక సాంకేతికత. ఇది అనేక మహిళలకు ఆశాజనకమైన పరిష్కారంగా మారింది. అయితే ఇదంతా వింటే చాలా సౌకర్యంగా అనిపించినా, దీనికి ఎలాంటి రిస్కులు లేవా? ఈ ప్రక్రియ సురక్షితమేనా? శరీరంపై దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? హార్మోన్ల ఇంజెక్షన్లు వల్ల పక్క ప్రభావాలేంటీ? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రక్రియకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ మరియు సేఫ్టీ విషయాలపై స్పష్టత పొందుకుందాం.


ఎగ్ ఫ్రీజింగ్ సురక్షితమేనా?: ఎగ్ ఫ్రీజింగ్ (Egg Freezing) అత్యాధునిక మెడికల్ సాంకేతికతతో చేసే ఒక relatively సేఫ్  ప్రక్రియే. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఈ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించి తల్లులు అయ్యారు. అయితే, ఇది పూర్తిగా ప్రమాదాల లేనిదే కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని తాత్కాలిక లేదా అరుదైన సమస్యలు ఎదురయ్యే అవకాశమూ ఉంటుంది.

హార్మోన్ ట్రీట్‌మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్: ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభంలో మహిళలకు ఒవ్యూలేషన్ స్టిమ్యులేషన్ (Ovulation Stimulation) కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి అండాలను ఎక్కువగా ఉత్పత్తి చేయించడానికి ఉపయోగిస్తారు. కొన్ని మహిళల్లో ఇవి తాత్కాలికంగా హార్మోనల్ Imbalance సృష్టించవచ్చు. దాని వల్ల:

- తల తిరుగడం

- డిప్రెషన్ లేదా మూడ్ స్వింగ్స్

- ఛాతీ నొప్పి

- పొత్తికడుపు వాపు

- ఓవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS) వల్ల జీర్ణకోశంలో నీరు చేరడం, వాంతులు, ఛాతీ నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

Also Read: ఎగ్ ఫ్రీజింగ్‌కి ముందు మహిళలు చేయించాల్సిన మెడికల్ టెస్టుల లిస్ట్

ఎగ్ రిట్రీవల్ సమయంలో ఎదురయ్యే సమస్యలు: అండాలను సేకరించే సమయంలో (Egg Retrieval), ఇది చిన్న శస్త్రచికిత్సలా (Minor Procedure) anesthesiaతో outpatientగా చేస్తారు. కానీ, కొన్ని అరుదైన సందర్భాల్లో బ్లీడింగ్, ఇన్‌ఫెక్షన్, లేదా పక్కనున్న అవయవాలకు గాయం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవి అత్యంత అరుదుగా జరుగుతాయి మరియు మెరుగైన ఆసుపత్రుల్లో ఈ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి.

దీర్ఘకాలిక ప్రభావాలున్నాయా?: ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల ప్రకారం, ఎగ్ ఫ్రీజింగ్ వల్ల భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం తగ్గుతుంది అని స్పష్టమైన ఆధారాలు లేవు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ ప్రక్రియ వల్ల పెరిగేలా లేదని వైద్యులు చెబుతున్నారు. కానీ హార్మోన్ వినియోగం ఉన్నందున, బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ముందుగా డాక్టర్ గైడెన్స్ తీసుకోవడం మంచిది.

మానసిక ఒత్తిడికి అవకాశముంది: ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో ఎక్కువ మంది మహిళలు "ఏమవుతుందో?" అనే ఆందోళన, హార్మోన్ల ప్రభావంతో వచ్చే భావోద్వేగ మార్పుల వలన కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఇది శారీరకంగా కాక మానసికంగా ఒక సవాలు కావచ్చు. అందుకే, సరైన కౌన్సెలింగ్, సపోర్ట్ అవసరం.

ఎగ్ ఫ్రీజింగ్ ఒక relatively safe, scientifically approved పద్ధతి. అయినా, ఇది పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రక్రియ కాదు. కొన్ని చిన్న చిన్న సమస్యలు తాత్కాలికంగా ఎదురవవచ్చు. కానీ మంచి వైద్యుల పర్యవేక్షణలో, సరైన క్లినిక్‌లో చేయించుకుంటే ప్రమాదాలు చాలా తక్కువ. ఎవరైనా ముందుగా వారి వైద్య చరిత్ర, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, డాక్టర్ సలహాతో ముందుకెళ్లడం చాలా ముఖ్యం.


Also Read: ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ద్వారా గర్భధారణ సాధ్యమవుతుందా? సక్సెస్ రేట్ ఎంత?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility


Post a Comment (0)
Previous Post Next Post