IVF Treatment: IVF అంటే In Vitro Fertilization. దీన్ని మనం సాధారణంగా "టెస్ట్ ట్యూబ్ బేబీ" విధానంగా పిలుస్తాము. సహజంగా గర్భం దాల్చలేని దంపతులకు ఇది ఓ అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుంది. ఈ పద్ధతిలో, మహిళ అండాన్ని మరియు పురుషుడి స్పెర్మ్‌ను ల్యాబ్ లో కలిపి ఎంబ్రియోను రూపొందిస్తారు. ఆ తరువాత, ఆ ఎంబ్రియోను మళ్లీ మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది, తద్వారా గర్భధారణ సాధ్యం అవుతుంది.
IVF ఎప్పుడు చేయాలి: IVF సాధారణంగా 35 ఏళ్లకు పైబడి గర్భం ధరించడంలో సమస్యలు ఎదుర్కొనే మహిళలకు, ఫాల్‌లోపియన్ ట్యూబ్ బ్లాక్ అయ్యిన వారికి, PCOS, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నవారికి, పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు IVFను సిఫారసు చేస్తారు.
IVF ప్రక్రియ దశలవారీగా: IVF ట్రీట్మెంట్ ఒక క్రమపద్ధతిలో దశలవారీగా జరుగుతుంది. మొదటిగా మహిళకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చి ఎక్కువ అండాలు ఏర్పడేలా చేస్తారు. తర్వాత స్కాన్‌లు, రక్తపరీక్షల ద్వారా అండాల ఎదుగుదల చూసి చూసి వాటిని బయటకు తీస్తారు. ఇదే సమయంలో పురుషుని నుంచి స్పెర్మ్ సేకరిస్తారు. ఈ అండాలు మరియు స్పెర్మ్‌లను ప్రయోగశాలలో కలిపి ఎంబ్రియోగా అభివృద్ధి చెందేలా చూస్తారు. అభివృద్ధిచెందిన ఎంబ్రియోను గర్భాశయంలోకి ఉంచుతారు.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ చేయించడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందా?
IVF సక్సెస్ రేటు: IVF సక్సెస్ రేటు వయస్సుపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల లోపు మహిళలకు సక్సెస్ రేటు 40% - 50% వరకు ఉండొచ్చు. కానీ వయస్సు పెరిగేకొద్దీ శరీర సామర్థ్యం తగ్గి IVF IVF సక్సెస్ రేటు తగ్గుతుంది. ఎంబ్రియో నాణ్యత, గర్భాశయ ఆరోగ్యం, స్పెర్మ్ క్వాలిటీ ఇవన్నీ కూడా IVF ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి.
IVF వల్ల సైడ్ ఎఫెక్ట్స్: IVF ఓ ప్రయోజనకరమైన చికిత్స అయినప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల ఒత్తిడి, తలనొప్పులు, బలహీనత ఉండొచ్చు. IVF విఫలమైన సందర్భాల్లో మానసిక ఒత్తిడి కూడా పెరగొచ్చు. డాక్టర్ గైడెన్స్‌తో జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఇవన్నీ అధిగమించవచ్చు.
IVFతో ఆశ నింపుకున్న కుటుంబాలు: IVF అనేది ఎన్నో కుటుంబాల్లో ఆశను నింపింది. సహజంగా గర్భం రాక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది మహిళలు ఈ టెక్నాలజీ ద్వారా తల్లులవుతున్నారు. ప్రస్తుతం IVF టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఖర్చు కూడా కొంత తగ్గింది. ప్రభుత్వ హాస్పిటల్‌లు, ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్‌ల ద్వారా IVF అందుబాటులోకి వచ్చింది.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ సేఫ్‌నా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా ప్రమాదాలుంటాయి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility