How Frozen Eggs Are Used: ఫ్రీజ్ చేసిన ఎగ్స్ వాడే ప్రక్రియను మెడికల్ నిపుణుల పర్యవేక్షణలో క్రమంగా పూర్తిచేస్తారు. మొత్తం ప్రక్రియలో ముఖ్యమైన దశలు:
1. ఎగ్స్‌ను కరిగించడం (Thawing): తొలుత డీప్ ఫ్రీజ్‌లో ఉన్న ఎగ్స్‌ను ప్రత్యేక పద్ధతిలో కరిగించి, వాటి జీవనశక్తిని నిలబెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
2. సర్వైవల్ చెక్: కరిగిన తర్వాత ఎగ్స్ బాగున్నాయా లేదా పరిశీలిస్తారు. వాడదగిన ఎగ్స్‌ను మాత్రమే తదుపరి దశకు తీసుకుంటారు.
3. ఫెర్టిలైజేషన్ కోసం ICSI: ఒకే స్పెర్మ్‌ను నేరుగా ఒక్కో ఎగ్‌లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది ICSI పద్ధతి, ఇది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే టెక్నిక్.
4. ఎంబ్రియో అభివృద్ధి: ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఎంబ్రయోలను కొన్ని రోజులు ల్యాబ్‌లో పెంచుతారు. సాధారణంగా 3 నుంచి 5 రోజుల వరకు ఉంచుతారు.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ చేసిన ఎగ్స్ ఎంతకాలం నిల్వ ఉంచవచ్చు?
5. ఎంబ్రయో ఎంపిక: ఆరోగ్యంగా అభివృద్ధి చెందిన ఎంబ్రయోలను ఎంపిక చేసి, అవసరమైన జన్యు పరీక్షలు చేస్తారు.
6. ఎంబ్రయో ట్రాన్స్‌ఫర్: ఎంపికైన ఎంబ్రయోను గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇది తక్కువ సమయములో జరిగే ప్రొసీజర్.
7. హార్మోన్ సపోర్ట్: ట్రాన్స్‌ఫర్ తరువాత గర్భధారణను నిలబెట్టేందుకు హార్మోన్ ట్రీట్మెంట్ (ప్రొజెస్టెరోన్ వంటివి) ఇస్తారు.
8. గర్భధారణ నిర్ధారణ: ట్రాన్స్‌ఫర్ అయిన 2 వారాల తర్వాత రక్త పరీక్ష ద్వారా గర్భం వచ్చినదా లేదో పరీక్షిస్తారు.
ఈ మొత్తం ప్రక్రియ అత్యంత సైంటిఫిక్ గా నిర్వహించబడుతుంది. ఫ్రీజ్ చేసిన ఎగ్స్ వాడాలనుకునే మహిళలకు ఇది చక్కని మార్గం. ఫ్రీజ్ చేసిన ఎగ్స్‌ను వాడే సమయానికి, ఆరోగ్య స్థితి, హార్మోన్ల బ్యాలెన్స్, అవసరమైన ట్రీట్మెంట్‌పై డాక్టర్ స్పష్టమైన గైడన్స్ ను ఇస్తారు.
Also Read: ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ పెయిన్ గా ఉంటుందా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility