Egg Freezing Storage Duration: ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో, మహిళల నుంచి ఎగ్స్‌ను సేకరించి ప్రత్యేకమైన ఫ్రీజింగ్ టెక్నాలజీ ద్వారా -196°C ఉష్ణోగ్రత వద్ద ద్రవ నైట్రోజన్‌లో నిల్వ ఉంచతారు. సాధారణంగా, ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్‌ను 10 నుండి 15 ఏళ్ల వరకు భద్రంగా నిల్వ ఉంచవచ్చు. కొన్ని క్లినిక్స్‌లో ఇది 20 సంవత్సరాల వరకూ కొనసాగే అవకాశం ఉంది.
అయితే, కొన్ని దేశాల్లో లేదా క్లినిక్స్‌లో స్థానిక చట్టాలు, గైడ్‌లైన్స్ ఆధారంగా నిల్వ ఉంచే గరిష్ట కాలాన్ని పరిమితం చేస్తారు. కొన్ని చోట్ల 10 సంవత్సరాల వరకే పరిమితి ఉంటుంది, కానీ అవసరమైతే ఇది పొడిగించడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయించుకోవడం బెస్ట్?
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఎగ్ ఫ్రీజ్ చేసిన కాలం ఎంతయినా అయినా, ఎగ్ క్వాలిటీ ఫ్రీజ్ చేసిన రోజున ఉన్న స్థితికే నిలిచిపోతుంది. అంటే, మీరు 30 ఏళ్ల వయసులో ఫ్రీజ్ చేస్తే, 40 ఏళ్లకు ఉపయోగించినా అది 30 ఏళ్ల ఎగ్‌గానే ఉంటుంది.
ఎగ్ ఫ్రీజింగ్ అనేది భవిష్యత్తులో గర్భధారణకు గల అవకాశాలను మెరుగుపరిచే ఆధునిక పద్ధతి. ఎప్పుడైతే అవసరం వస్తుందో, అప్పుడు ఆరోగ్యకరమైన గర్భధారణకు ఈ ఫ్రీజ్‌డ్ ఎగ్స్ ఉపయోగపడతాయి.
Also Read: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఎప్పుడు మరియు ఎందుకు చేస్తారు?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility