Oocyte Cryopreservation: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఎప్పుడు మరియు ఎందుకు చేస్తారు? | Pozitiv Fertility, Hyderabad

Oocyte Cryopreservation: ఎగ్ ఫ్రీజింగ్‌ను వైద్య భాషలో ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ (Oocyte Cryopreservation) అంటారు. ఇది ఒక ఆధునిక పద్ధతి, ఇందులో మహిళల అండాలు (eggs) సేకరించి, ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫ్రోజెన్‌ చేసి భద్రపరిచే ప్రక్రియ. అవసరమైన సమయంలో ఆ ఫ్రోజెన్ ఎగ్‌ను డిఫ్రాస్ట్ (కరగడం) చేసి, ఫెర్టిలైజేషన్ (పురుషుడి వీర్యంతో కలిపి) చేసి గర్భధారణకు ఉపయోగిస్తారు.

ఎగ్ ఫ్రీజింగ్‌ ఎందుకు చేస్తారు: ఎగ్ ఫ్రీజింగ్‌ను ఎక్కువగా నేటి కెరీర్-ఓరియెంటెడ్ మహిళలు, లేదా వివాహం ఆలస్యంగా చేసుకోవాలనుకునేవారు, లేదా ఇంకా తాము తల్లిగా మారే సమయం రాలేదనుకునేవారు ఎంచుకునే ప్రత్యామ్నాయం. కొంతమంది ఆరోగ్య కారణాల వల్ల for example: క్యాన్సర్ కీమోథెరపీ, ఎండోమెట్రియోసిస్, PCOS, అండాశయ రిజర్వ్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఎగ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతారు.

ఎప్పుడు చేయాలి: ఎగ్ ఫ్రీజింగ్‌కు ఉత్తమ వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య. ఎందుకంటే ఈ వయస్సులో అండాలు ఆరోగ్యంగా ఉండే అవకాశముంటుంది. వయస్సు పెరిగేకొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది. అందుకే ముందుగానే అండాలను భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో తల్లిగా మారే అవకాశం పెంచుకోవచ్చు.

ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు?

1. ముందుగా హార్మోన్ల ద్వారా ఎగ్స్ ను (ఒవేరియన్ స్టిమ్యులేషన్).

2. స్కాన్‌ లు చేసి పెద్ద ఎగ్స్ ను ఎంచుకుని, చిన్న సర్జరీ ద్వారా వాటిని సేకరిస్తారు.

3. అనంతరం వాటిని liquid nitrogen సహాయంతో ఫ్రోజెన్ చేసి ప్రత్యేకమైన ల్యాబ్‌లో భద్రపరుస్తారు.

Also Read: ఇప్పుడే పిల్లలు ఒద్దు అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇదే.!

ఎగ్ ఫ్రీజింగ్ వల్ల లాభాలేమిటి?

భవిష్యత్తులో పెగ్నెంట్ అవ్వాలనే వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక గొప్ప ఛాయిస్.

సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గినా, వృద్ధాప్యంలో కూడా గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్నవారు ముందుగానే అండాలను భద్రపరచుకోవచ్చు.

ఎగ్ ఫ్రీజింగ్ ఖర్చు ఎంత?

భారతదేశంలో ఇది ఒక cycle కు సుమారుగా రూ. 1.5 లక్షలు నుంచి రూ. 2.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అండాలను నిల్వచేయడానికీ ప్రతి సంవత్సరం అదనపు భద్రతా ఛార్జీ ఉంటుంది.

ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మహిళా శరీరానికి, భవిష్యత్తు మాతృత్వానికి ఇచ్చే సాంకేతిక సహాయం. ఇది ప్రస్తుతానికి అవసరంలేని బాధ్యతను భవిష్యత్తుకు నిల్వ చేయడమే. అయితే దీన్ని డాక్టర్ సలహాతో, సమయానికి చేయించుకోవడం చాలా ముఖ్యం. 

ఎగ్ ఫ్రీజింగ్‌ అనేది భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలను మెరుగుపరిచే ఆధునిక పద్ధతి. ఎప్పుడైతే అవసరం వస్తుందో, అప్పుడు ఆరోగ్యకరమైన గర్భధారణకు ఈ ఫ్రీజ్‌డ్ ఎగ్స్ ఉపయోగపడతాయి.

Also Read: PCOD ఉందని ఎలా తెలుసుకోవచ్చు?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility


Post a Comment (0)
Previous Post Next Post