Egg Freezing: ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళలు తమ ఎగ్స్ భవిష్యత్తులో ఉపయోగించేందుకు ఫ్రీజింగ్ ద్వారా భద్రపరచుకునే ప్రక్రియ. ఇది ప్రధానంగా గర్భధారణను ఆలస్యం చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.
1. వయసుతో ఎగ్ నాణ్యత తగ్గుతుంది: మహిళ వయసు పెరిగేకొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందుకే 30 ఏళ్ల లోపే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది.
2. ట్రీట్మెంట్‌కు 10–14 రోజులు పడుతుంది: హార్మోనల్ ఇంజెక్షన్లు, ఫోలికల్స్ గమనించడం, ఎగ్ రిట్రీవల్ వంటి దశలు ఉంటాయి. మొత్తం ప్రక్రియకు దాదాపు రెండు వారాలు పడుతుంది.
3. ఖర్చు: ఒకసారి ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి సుమారు ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఖర్చవుతుంది. అంతేకాదు, ప్రతి సంవత్సరం స్టోరేజ్ కోసం అదనంగా ₹20,000–₹30,000 వరకు ఉంటుంది.
4. భవిష్యత్తులో గర్భధారణకు సహకరిస్తుంది: వివాహం ఆలస్యంగా జరిగే వారు లేదా కొంతకాలం గర్భధారణను వాయిదా వేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
Also Read: PCOD ఉందని ఎలా తెలుసుకోవచ్చు?
5. ఆరోగ్య పరిస్థితులకు ఉపయోగపడుతుంది: కేన్సర్ కీమోథెరపీ, ఎండోమెట్రియోసిస్ లాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఫెర్టిలిటీ ప్రభావితమవుతుందని అనిపించినా ముందుగా ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకోవచ్చు.
6. గ్యారంటీ కాదు - అవకాశం మాత్రమే: ఎగ్ ఫ్రీజ్ చేసిన వెంటనే గర్భం రావడం గ్యారంటీ కాదు. వయసు, ఎగ్ నాణ్యత, ఆరోగ్యం ఆధారంగా IVF అనేది విజయవంతం అవుతుంది.
7. ఇది వ్యక్తిగత నిర్ణయం: ఎగ్ ఫ్రీజింగ్ ఒక ప్రాక్టికల్, ఫ్యూచర్ ప్లానింగ్ డెసిషన్. దీన్ని తీసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకుని, మీకు తగినదేనా అనేది తెలుసుకోవాలి.
ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళలకు భవిష్యత్తులో తల్లి కావడానికి ఒక సాంకేతిక అవకాశం. కానీ ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం కావడంతో పాటు పూర్తి అవగాహనతో తీసుకోవాలి. ఎప్పుడూ ముందు వైద్య సలహా తీసుకోవడమే ఉత్తమ మార్గం.
Also Read: ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి మూడు నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility