Egg Freezing: ఎవరు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలి? | Pozitiv Fertility, Hyderabad

Egg Freezing: ఎగ్ ఫ్రీజింగ్ ప్రతి మహిళకు అవసరం కాదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది మంచి ఆప్షన్ అవుతుంది. 

1. వివాహం ఆలస్యం అవుతున్నవారు: వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉండి, భవిష్యత్తులో తల్లి కావాలనుకునే మహిళలకు ఇది ఓ భద్రత.

2. కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకునే వారు: కెరీర్, విద్య వంటి కారణాలతో తల్లి కావడం వాయిదా వేసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

3. కేన్సర్ లాంటి చికిత్సలు ఎదుర్కొనేవారు: కీమోథెరపీ లేదా రెడియేషన్ వల్ల ఫెర్టిలిటీ తగ్గే అవకాశం ఉన్నవారు ముందుగానే ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకోవచ్చు.

4. ఫ్యామిలీలో అకాల మెనోపాజ్ చరిత్ర ఉన్నవారు: తొలిదశ మెనోపాజ్ వచ్చే అవకాశమున్నవారు ముందు చర్యగా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం మంచిది.

Also Read: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఎప్పుడు మరియు ఎందుకు చేస్తారు?

5. ఎండోమెట్రియోసిస్, PCOS లాంటి సమస్యలున్నవారు: ఈ ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో ఫెర్టిలిటీపై ప్రభావం చూపవచ్చు. అందుకే ముందుగా ఎగ్ ఫ్రీజింగ్  చేసుకోవచ్చు.

6. ఫస్ట్ డెలివరీ తరువాత బ్రేక్ తీసుకోవాలనుకునే వారు: మొదటి సంతానం తర్వాత కొంత విరామం తీసుకుని, మళ్లీ తల్లి కావాలనుకునే వారు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు.

ఈ నిర్ణయం తీసుకోవాలంటే వ్యక్తిగత పరిస్థితులు, వైద్య సలహా, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ పరిగణించాలి. సరైన నిర్ణయం కోసం ఫెర్టిలిటీ స్పెషలిస్టుతో సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఇప్పుడే పిల్లలు ఒద్దు అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇదే.!

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post