Can Fibroids Affects Fertility: పిల్లలు పుట్టకపోవడానికి ఫైబ్రాయిడ్స్ కూడా ఒక కారణమా? | Pozitiv Fertility, Hyderabad

Can Fibroids Affects Fertility: ఫైబ్రాయిడ్స్ (Fibroids) పిల్లలు పుట్టకపోవడానికి (ఇన్ఫెర్టిలిటీకి) ఒక ప్రధాన కారణంగా మారవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్కర్లోనూ తప్పనిసరిగా ఇన్ఫెర్టిలిటీకి దారి తీస్తుందన్న అర్థం కాదు. కొన్ని ఫైబ్రాయిడ్స్ చిన్నవిగా ఉండి, ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. కానీ కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ గర్భధారణ ప్రక్రియపై ప్రభావం చూపుతాయి.

Can Fibroids Affects Fertility

ఫైబ్రాయిడ్స్ వల్ల గర్భధారణపై ప్రభావాలు ఎలా ఉంటాయి?

1. గర్భాశయ ఆకృతిని మార్చడం: పెద్ద సబ్‌మ్యూకోసల్ (Submucosal) ఫైబ్రాయిడ్స్ గర్భాశయ గదిని (uterine cavity) డిఫార్మ్ చేస్తాయి. ఫలితంగా ఎంబ్రియో ఇంప్లాంటేషన్‌కి ఆటంకం కలుగుతుంది.

2. ఫెలోపియన్ ట్యూబ్స్‌ పై ఒత్తిడి: ఇంట్రామ్యూరల్ లేదా సబ్ సెరోసల్ ఫైబ్రాయిడ్స్ పెరిగి ఫెలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేయవచ్చు. దీంతో స్పెర్మ్స్ ఎగ్ ను చేరుకోలేదు.

3. రక్తప్రసరణ లో మార్పులు: ఫైబ్రాయిడ్ ఉన్న చోట రక్తప్రసరణ మారిపోవచ్చు, ఇది ఎంబ్రియోకి తగిన న్యూట్రియంట్స్ అందకుండా చేసే అవకాశం ఉంటుంది.

4. గర్భధారణ సమయంలో ఇబ్బందులు: ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఫైబ్రాయిడ్స్ వల్ల మిస్కారేజ్, ప్రీ టర్మ్ లేబర్, డెలివరీ టైంలో రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఫైబ్రాయిడ్స్ ఉన్నవారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేముందు గైనకాలజిస్ట్ సలహా తీసుకోవాలి. అవసరమైతే హార్మోన్ ట్రీట్మెంట్లు లేదా మయోమెక్టమీ (Fibroid Removal Surgery) ద్వారా ఫైబ్రాయిడ్స్‌ను తొలగిస్తారు.

ఫైబ్రాయిడ్స్ వల్ల గర్భధారణపై ప్రభావం ఉండొచ్చు, కానీ ఇది అధిగమించదగిన సమస్య. ఆధునిక వైద్యం, ఫెర్టిలిటీ టెక్నాలజీలతో చాలామంది మహిళలు విజయవంతంగా గర్భం ధరించగలుగుతున్నారు. కనుక సమయానికి డాక్టర్‌ని సంప్రదించడం ముఖ్యం.

Also Read: ZERO Sperm ఉన్నవారికి ప్రెగ్నెన్సీ రావాలంటే ఇది బెస్ట్ ట్రీట్మెంట్!

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility


Post a Comment (0)
Previous Post Next Post