Diagnosing Recurrent Miscarriage: తరచుగా గర్భస్రావం (Repeated Miscarriages) జరుగుతుంటే, దానికి కారణం హార్మోనల్ సమస్యలా? లేదా జెనిటిక్ సమస్యలా? లేక గర్భాశయంలో ఏమైనా లోపమా? అనే విషయాలను కనుగొనడానికి వైద్యులు కొన్ని ముఖ్యమైన పరీక్షలు సూచిస్తారు. వీటిలో ఒకటి "హిస్టెరోస్కోపీ (Hysteroscopy)", అలాగే "హిస్టెరోసల్పింగోగ్రామ్ (HSG)", కార్యోటైపింగ్, హార్మోనల్ అసెస్‌మెంట్, ఎమ్బ్రియో జనెటిక్ టెస్టింగ్ (PGT-A) వంటి ప్రత్యేక పరీక్షలు ఉంటాయి.
ఈ పరీక్షల ద్వారా గర్భాశయంలో పొలిప్స్, ఫైబ్రాయిడ్స్, సెప్టం, లేదా అసాధారణ ఆకృతి వంటివి ఉన్నాయా అన్నది కనుగొనొచ్చు. అంతేకాకుండా, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, లేదా రక్తం గడ్డకట్టే సమస్యల వల్ల అబార్షన్ జరుగుతుందా అన్నది తెలుసుకోవచ్చు.
ఈ రకమైన ఇన్వెస్టిగేషన్‌లు చేయడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించి, అవసరమైన చికిత్సను చేపట్టి మళ్ళీ గర్భధారణను విజయవంతంగా కొనసాగించే అవకాశం పెరుగుతుంది.
తరచుగా గర్భస్రావం అవుతున్న మహిళలు ఆలస్యం చేయకుండా ఫెర్టిలిటీ స్పెషలిస్టును సంప్రదించి ఈ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
Also Read: IVF ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility