IVF Process and Cost: 1. ట్రీట్మెంట్ ప్రక్రియ: IVF ట్రీట్మెంట్ చాలా దశలలో జరుగుతుంది. మొదటిగా మహిళకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, వీటివల్ల గర్భాశయంలో ఒక్కటి కంటే ఎక్కువ అండాలు తయారవుతాయి. అండాలు సరైన పరిపక్వ స్థితికి వచ్చాక, వాటిని శస్త్రచికిత్స ద్వారా బయటకు తీస్తారు. ఒకేసారి పురుషుడి నుంచి స్పెర్మ్ సేకరించి, ప్రయోగశాలలో ఆ అండాలతో ఫెర్టిలైజ్ చేస్తారు. ఫెర్టిలైజేషన్ విజయవంతమైతే ఎంబ్రియో ఏర్పడుతుంది. ఆరోగ్యవంతమైన ఎంబ్రియోను మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
2. మొత్తం దశలు ఇవే:
- ఓవరియన్ స్టిమ్యులేషన్ (Hormonal injections)
- ఎగ్ రిట్రీవల్ (Egg retrieval)
- స్పెర్మ్ కలెక్షన్
- ఫెర్టిలైజేషన్ ల్యాబ్‌లో చేయడం
- ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్
- 2 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్
3. ఖర్చు ఎంత అవుతుంది?: IVF ట్రీట్మెంట్ ఖర్చు ఆసుపత్రి, నగరం, మెడికల్ అవసరాలపై ఆధారపడి మారవచ్చు. సాధారణంగా ఒక్క IVF cycleకి ఖర్చు ₹1.5 లక్షల నుండి ₹2.5 లక్షల మధ్య ఉంటుంది. కొన్ని హైఎండ్ ఫెర్టిలిటీ క్లినిక్స్‌లో ఇది ₹3 లక్షల దాకా కూడా వెళ్లొచ్చు.
Also Read: మెనార్చే అంటే ఏమిటి? ప్రతి అమ్మాయి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.!
4. అదనపు ఖర్చులు:
మందులు (హార్మోన్ల ఇంజెక్షన్లు): ₹30,000 – ₹60,000
స్కానింగ్, రక్తపరీక్షలు: ₹10,000 – ₹20,000
ఫ్రీజింగ్ (ఎంబ్రియో లేదా ఎగ్ స్టోరేజ్): ప్రతి ఏడాది ₹10,000 – ₹20,000
5. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?: చాలా గవర్నమెంట్ హెల్త్ స్కీములు లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు IVF ట్రీట్మెంట్‌ను కవర్ చేయవు. కానీ కొన్ని కంపెనీలు, కార్పొరేట్ ఉద్యోగులకు IVF క్లెయిమ్‌ను పరిమిత స్థాయిలో ఆమోదిస్తున్నాయి. ముందుగా పాలసీని చదవడం లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ కేర్‌ను సంప్రదించడం మంచిది.
6. ఫలితం ఇవ్వకపోతే మళ్లీ చేస్తారా?: ఒక IVF cycle ఫలితం ఇవ్వకపోతే, డాక్టర్లు మళ్లీ ప్రయత్నించాలని సూచించవచ్చు. ప్రతి సైకిల్‌కి మళ్ళీ పై విధంగా ఖర్చు వస్తుంది. అందుకే మొదటి సారి నుంచే మంచి ఫెర్టిలిటీ సెంటర్, అనుభవం ఉన్న డాక్టర్లు ఎంచుకోవడం అవసరం.
Also Read: డోనర్ ఎగ్స్ అంటే ఏమిటి? ఇవి ఎవరు ఉపయోగించాలి?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility