Menarche: మెనార్చే అనేది బాలికకు మొదటిసారి పీరియడ్స్ రావడం. ఇది సాధారణంగా 10 నుండి 15 ఏళ్ల వయస్సులో జరుగుతుంది. కొన్ని పిల్లలకు తక్కువ వయస్సులో కూడా రాగలదు, కానీ ఎక్కువగా 12–13 ఏళ్ల లోపలే మొదలవుతుంది. మెనార్చే అనేది శరీరం పెద్దయ్యే దశలో ఒక ముఖ్యమైన మార్పు. మెనార్చే వచ్చిన తరువాత, ఆమె రీప్రొడక్షన్ వ్యవస్థ (గర్భం ధరించగల సామర్థ్యం) పూర్తిగా అభివృద్ధి చెందినట్టు అర్థం.
ఈ దశకు ముందు పిల్లల శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. బ్రెస్ట్ సైజు పెరగడం, పబ్ హెయిర్ (అవాంఛిత రోమాలు) రావడం, హైటు పెరగడం మొదలైనవన్నీ మెనార్చేకు ముందు వచ్చే లక్షణాలు. మెనార్చే వచ్చిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల్లో పీరియడ్స్ క్రమం ప్రకారం ప్రతి నెలకొకసారి రావకపోవచ్చు. ఒకసారి రాగా, మళ్లీ నెలల తరబడి రాకపోవడం వంటి సమస్యలు ఉండొచ్చు. కానీ ఇవి ఎక్కువగా తాత్కాలికమే. శరీరం తన మార్పులకు అలవాటు పడుతున్న సమయంలో ఇది సాధారణం.
అమ్మాయిలు మెనార్చే సమయంలో భయపడకుండా ఉండేలా తల్లిదండ్రులు, టీచర్లు సరైన గైడెన్స్ ఇవ్వాలి. ఇది ఒక అనారోగ్యం కాదు, ఇది శరీరంలో జరిగే సహజమైన జీవనదశ. శుభ్రత పాటించడం, ప్రాపర్ డైట్ తీసుకోవడం, నిద్ర, మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యమయ్యే టైం ఇదే.
మెనార్చే ఒకసారి వచ్చిన తర్వాత అమ్మాయి తన శారీరక మార్పులను అర్థం చేసుకోవడం, ఎమోషనల్‌గా బలంగా ఉండడం అవసరం. కొంతమంది అమ్మాయిలకు బలహీనత, పొత్తి కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి. వాటిని చిన్న విషయంగా భావించకుండా అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించాలి.
మెనార్చే అనేది ప్రతి అమ్మాయికి కొత్త ప్రయాణం మొదలు అయ్యే దశ. ఈ దశను సరైన అవగాహనతో స్వీకరిస్తే, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదగగలుగుతుంది.
Also Read: IVF ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది? దశల వారిగా పూర్తి వివరణ
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility