Embryo Freezing: ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌లో భాగంగా ఉపయోగించే సైంటిఫిక్ మెథడ్. ఇందులో పురుషుడు మరియు మహిళ నుండి తీసిన స్పెర్మ్ మరియు ఎగ్స్ ల్యాబ్‌లో ఫెర్టిలైజ్ చేసి ఏర్పడిన ఎంబ్రియోలను క్రయోప్రిజర్వేషన్ పద్ధతిలో (-196 డిగ్రీల సెల్సియస్‌లో) నిల్వ చేస్తారు. అవసరమైన సమయంలో వాటిని తిరిగి మహిళ గర్భాశయంలోకి ఇంప్లాంట్ చేస్తారు.
ఈ ప్రక్రియను చాలా సందర్భాల్లో చేస్తారు. ఉదాహరణకు:
- ఒక IVF సైకిల్‌లో ఎక్కువ ఎంబ్రియోలు ఏర్పడినప్పుడు, వాటిని భవిష్యత్తులో గర్భధారణ కోసం నిల్వ చేసుకోవచ్చు.
- మహిళకు కేన్సర్ వంటి వ్యాధికి చికిత్స (కీమో/రేడియోథెరపీ) అవసరమైతే, ట్రీట్మెంట్ ముందు ఎంబ్రియోలను ఫ్రీజ్ చేయడం వల్ల తర్వాత గర్భం దాల్చే అవకాశం ఉంటుంది.
Also Read: డోనర్ ఎగ్స్ అంటే ఏమిటి? ఇవి ఎవరు ఉపయోగించాలి?
- ఒకసారి గర్భధారణ సక్సెస్ అయిన తరువాత మిగిలిన ఆరోగ్యకరమైన ఎంబ్రియోలను భవిష్యత్ కోసం నిల్వ చేస్తారు.
- కొన్ని జంటలు తమ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే ఉద్దేశ్యంతో ముందుగానే ఎంబ్రియోలను ఫ్రీజ్ చేయించుకుంటారు.
ఈ పద్ధతిలో ఎంబ్రియోల నాణ్యతను జాగ్రత్తగా పరీక్షించి, వాటిని స్పెషలైజ్డ్ క్రయోస్టోరేజ్ ట్యాంక్‌లలో భద్రపరిచే విధానాన్ని పాటిస్తారు. ఆధునిక టెక్నాలజీ వలన, ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోలతో గర్భధారణ సక్సెస్ రేట్ కూడా చాలా ఉంటుంది. ఇది పిల్లలు కావాలనుకునే వారికి శాశ్వతంగా ఉపయోగపడే సైంటిఫిక్ మెథడ్.
Also Read: IVF ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility