Egg Count for IVF Success: IVF ట్రీట్మెంట్ సక్సెస్ సాధించడానికి ఎన్ని ఎగ్స్ అవసరం? | Pozitiv Fertility, Hyderabad

Egg Count for IVF Success: IVF (In Vitro Fertilization) ప్రక్రియలో సక్సెస్ సాధించడానికి అవసరమైన ఎగ్స్ సంఖ్య మహిళ వయసు, ఆరోగ్య స్థితి, హార్మోన్ల స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఒక్క IVF సైకిల్‌లో 10 నుంచి 15 మెచ్యూర్ (పూర్తిగా అభివృద్ధి చెందిన) ఎగ్స్‌ తీసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. అయితే అందులో ప్రతి ఎగ్ ఫెర్టిలైజ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ఎక్కువ మెచ్యూర్ ఎగ్స్ అవసరమవుతాయి.


ఉదాహరణకు, ఒకసారి 10 ఎగ్స్ తీసుకున్నారని అనుకుంటే:

- వాటిలో 8 ఎగ్స్ మెచ్యూర్ అయి ఉండవచ్చు

- వాటిలో 6 ఎగ్స్ ఫెర్టిలైజ్ అయి, ఎంబ్రియోస్‌గా మారతాయి

- చివరకు వాటిలో 1 లేదా 2 ఆరోగ్యకరమైన ఎంబ్రియోలు మాత్రమే గర్భధారణకు ఉపయోగపడవచ్చు

Also Read: ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేస్తారు?

అందుకే, వయసు పెరిగే కొద్దీ ఎగ్స్ నాణ్యత తగ్గే అవకాశం ఉన్నందున, వైద్యులు ఎక్కువ సంఖ్యలో ఎగ్స్‌ను సేకరించేందుకు హార్మోనల్ స్టిమ్యులేషన్ మందులు ఇస్తారు. యువతుల్లో (30 లోపు) తక్కువ సంఖ్యలో ఎగ్స్‌తో కూడా IVF విజయవంతమవుతుంటే, పెద్దవయసు మహిళల్లో మాత్రం ఎక్కువ ఎగ్స్ అవసరమవుతుంది. IVF సక్సెస్ అవ్వడానికి  కనీసం 10కి పైగా మెచ్యూర్ ఎగ్స్ అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: IVF ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post