Precautions Before IVF Treatment: IVF ట్రీట్మెంట్ మొదలు పెట్టే ముందు శారీరకంగా, మానసికంగా కూడా సన్నద్ధం కావడం చాలా అవసరం. ఈ ప్రక్రియ సక్సెస్ అయ్యేందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. వైద్య పరీక్షలు మరియు హార్మోన్ టెస్ట్‌లు: IVF ట్రీట్మెంట్ ప్రారంభానికి ముందు మహిళకు కొన్ని ముఖ్యమైన టెస్ట్‌లు నిర్వహిస్తారు. వీటిలో AMH టెస్ట్, AFC స్కాన్, థైరాయిడ్, ప్రోలాక్టిన్, షుగర్ లెవెల్స్ వంటి రక్త పరీక్షలు చేస్తారు. భర్తకు స్పెర్మ్ ఎనాలసిస్ చేయడం ద్వారా స్పెర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ లాంటి అంశాలను విశ్లేషిస్తారు.
2. ఆరోగ్యకరమైన జీవనశైలి: IVF ట్రీట్మెంట్ ప్రారంభానికి కనీసం 2 నెలల ముందు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మంచిది. పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటివి పూర్తిగా మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ఎగ్ నాణ్యత మెరుగవుతుంది. సరైన నిద్ర కూడా మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
3. మానసిక ఆత్మవిశ్వాసం: IVF ప్రక్రియ కొంత సమయం పట్టే ప్రక్రియ. ఇది శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమయంలో మీ భాగస్వామితో మానసిక మద్దతుగా ఉండటం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది.
Also Read: IVF ట్రీట్మెంట్ సక్సెస్ సాధించడానికి ఎన్ని ఎగ్స్ అవసరం?
4. మందుల నియంత్రణ: మీరు తీసుకుంటున్న మందులు లేదా సప్లిమెంట్లు గురించి మీ వైద్యుడికి ముందుగానే చెప్పాలి. IVF ట్రీట్మెంట్ మొదలయ్యాక కొన్ని మందులు ఆపాల్సి ఉండవచ్చు. డాక్టర్ సూచించిన ఫోలిక్ ఆసిడ్ లేదా ఇతర ఫెర్టిలిటీ బూస్టింగ్ సప్లిమెంట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
5. ఫైనాన్షియల్ ప్లానింగ్: IVF ట్రీట్మెంట్ కొంత ఖర్చుతో కూడుకున్నదైనందున ముందుగానే ఖర్చుల అంచనా వేసి, ఆసుపత్రి ప్యాకేజీలు తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎంబ్రియో ఫ్రీజింగ్, డోనర్ ఎగ్స్ అవసరం అవుతుండడం వల్ల అదనపు ఖర్చులు రావచ్చు.
ఈ విధంగా IVF ముందు తీసుకునే జాగ్రత్తలు సురక్షితమైన, విజయవంతమైన గర్భధారణ అవకాశాలను పెంచుతాయి.
Also Read: ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు చేస్తారు?