IVF gender selection in India: సాధారణంగా IVF (In Vitro Fertilization) ప్రక్రియలో పిల్లల లింగం (gender) ఎంపిక చేసుకోవడం భారతదేశంలో నిషేధించబడింది. ఇది PCPNDT Act (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act), 1994 ప్రకారం శాస్త్రపూర్వకంగా, న్యాయపరంగా కూడా చట్టవిరుద్ధం. దీని ఉద్దేశం లింగ వివక్ష (gender discrimination), మహిళా భ్రూనహత్యలను (female foeticide) అడ్డుకోవడమే.
అయితే, కొన్ని దేశాలలో.. ఉదాహరణకు అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో medical necessity ఉంటే, ఉదాహరణకు జన్యుపరమైన వ్యాధులు ఒక్క particular gender లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటే, అప్పుడు PGT (Preimplantation Genetic Testing) ద్వారా జెండర్ సెలెక్షన్ ను అనుమతిస్తారు. కానీ ఇది కేవలం ఆరోగ్య పరమైన కారణాల కోసమే ఉపయోగించాలి.
Also Read: IVF తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముఖ్యమైన విషయాలు:
భారతదేశంలో IVF ద్వారా జెండర్ ఎంపిక చట్టబద్ధంగా నిషేధం.
చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర శిక్షలు, జైలు శిక్ష, జరిమానాలు విధించబడతాయి.
స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం పాటించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తోంది.
IVF ద్వారా గర్భం కలగడం ఒక సైంటిఫిక్ మెథడ్ అయినా, లింగ ఎంపిక నైతికంగా, చట్టపరంగా కూడా తప్పు. ఆరోగ్యంగా, ఆనందంగా బిడ్డ పుట్టడం ప్రధాన లక్ష్యం కావాలి.
Also Read: IVF సక్సెస్ రేట్ ఎంత? దేనిమీద ivf సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility