IVF Process Timeline: IVF ప్రాసెస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఎంత సమయం పడుతుంది అనే విషయం చాలా మంది దంపతులకు ముందుగా తెలియాలి. సాధారణంగా ఒక IVF సైకిల్ ప్రారంభం నుంచి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ పూర్తయ్యే వరకు సుమారుగా 4 నుండి 6 వారాల సమయం పడుతుంది. అయితే ఈ గడువు వ్యక్తిగత పరిస్థితులపై, శరీర ప్రతిస్పందనపై ఆధారపడి మారవచ్చు.
ఈ IVF ప్రోసెస్‌ను దశలవారీగా ఇలా విభజించవచ్చు:
1. ప్రాథమిక పరిశీలనలు (1వ వారంలో): IVF ప్రారంభానికి ముందు వైద్యులు మీ హార్మోన్ల స్థాయిలు, గర్భాశయ ఆరోగ్యం, స్పెర్మ్ క్వాలిటీ వంటి అంశాలపై పలు మెడికల్ టెస్టులు చేస్తారు. ఈ దశలో బ్లడ్ టెస్టులు, అల్ట్రా సౌండ్ స్కాన్లు, సిమెన్ అనాలిసిస్ వంటివి జరుగుతాయి. ఇది సాధారణంగా 7–10 రోజులు పడుతుంది.
2. ఓవరి స్టిమ్యులేషన్ (8వ – 14వ రోజు): ఈ దశలో డైలీ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి. వాటి ద్వారా ఓవరీస్ ఎక్కువగా ఎగ్స్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తారు. ఈ సమయంలో ఫోలిక్యులర్ స్కాన్లు చేస్తూ ఎగ్స్ ఎదుగుదలపై మానిటరింగ్ ఉంటుంది. ఇది 8–12 రోజులు కొనసాగుతుంది.
3. ఎగ్ రిట్రీవల్ (14వ – 16వ రోజు): ఓవరీస్ లో ఎగ్స్ మెచ్యూరిటీ అయిన తరువాత, చిన్న శస్త్రచికిత్స ద్వారా వాటిని సేకరిస్తారు. ఇది మైల్డ్ అనస్తీషియా కింద 30–40 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే రోజు పురుషుడి నుంచి స్పెర్మ్ కూడా సేకరిస్తారు. ఆపై శుద్ధి చేసి ఎంబ్రియో ఏర్పాటుకు సిద్ధం చేస్తారు.
Also Read: IVF లో జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చా?
4. ఎంబ్రియో ఫెర్టిలైజేషన్ మరియు గ్రోత్ (17వ – 21వ రోజు): ఎగ్స్ మరియు స్పెర్మ్‌ను లాబ్‌లో కలిపి ఫెర్టిలైజ్ చేస్తారు. 3 నుండి 5 రోజుల్లో ఎంబ్రియో అభివృద్ధి చెందుతుంది. ఇది కల్చర్ పీరియడ్ అంటారు. ఎంబ్రియో నాణ్యతను బట్టి అత్యుత్తమమైనదాన్ని ఎంచుకుని గర్భాశయంలోకి పెట్టడానికి సిద్ధం చేస్తారు.
5. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (20వ – 23వ రోజు): క్వాలిటీ ఎంబ్రియోను ఒక సింపుల్ ప్రొసీజర్ ద్వారా గర్భాశయంలోకి ప్రవేశ పెడతారు. ఇది పెయిన్ఫుల్ కాదు, సెడేషన్ అవసరం లేదు. ఇది కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.
6. గర్భధారణ పరీక్ష (28వ – 32వ రోజు): ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన 12–14 రోజులకు గర్భధారణ జరిగిందా లేదా అన్న విషయం తెలుసుకునేందుకు బ్లడ్ టెస్టు చేస్తారు (బీటా-HCG టెస్ట్). ఇది IVF సైకిల్ చివరి దశ.
మొత్తం సమయం: ఒక IVF సైకిల్ ప్రారంభం నుండి గర్భధారణ టెస్ట్ వరకు సాధారణంగా 30–40 రోజులు పడుతుంది. కానీ, ఒకసారి IVF సైకిల్ విఫలమైతే లేదా మరిన్ని ట్రైలు అవసరమైతే సమయం మరింత పెరగొచ్చు.
గమనిక: ప్రతి వ్యక్తి శరీర స్వభావాన్ని బట్టి డాక్టర్ IVF ప్రొటోకాల్‌ను మారుస్తారు. కాబట్టి మీకు సరైన సమాచారం మీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వద్ద నుంచి తెలుసుకోవడం మంచిది.
Also Read: IVF చికిత్సకు ఆక్యూపంచర్ థెరపీ ఈ విధంగా ఉపయోగపడుతుంది
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility