Sperm Under Microscope: మైక్రోస్కోప్‌లో స్పెర్మ్ ఎలా కనిపిస్తుందో తెలుసా? | Pozitiv Fertility, Hyderabad

Sperm Under Microscope: స్పెర్మ్ మన శరీరంలో కనిపించకుండా ఉండేంత చిన్నదైన కణం. ఇది ఒక మైక్రోస్కోపిక్ సెల్, అంటే దీనిని మన కళ్లతో నేరుగా చూడడం అసాధ్యం. అయితే మైక్రోస్కోప్ (సూక్ష్మదర్శిని) సహాయంతో స్పెర్మ్‌ను క్లియర్‌గా గమనించవచ్చు.

మైక్రోస్కోప్‌లో స్పెర్మ్‌ను పరిశీలిస్తే, ఇది తల (Head), మెడ (Neck), మరియు తోక (Tail)లుగా మూడు భాగాలుగా కనిపిస్తుంది.

తల భాగం కొంచెం ఒత్తుగా, మందంగా ఉంటుంది. ఇందులోనే జన్యు సమాచారం (DNA) ఉంటుంది. తోక భాగం బాగా పొడవుగా ఉండి, అలా తేలిపోతూ సాగిపోతుంది. ఇదే స్పెర్మ్ ముందుకు కదలడానికి సహాయపడుతుంది.

మెడ భాగం తల, తోక మధ్య కలుపు భాగం, ఇది ఎనర్జీ ఉత్పత్తిలో సహాయపడుతుంది. లైవ్ స్పెర్మ్‌ను చూస్తే ఇవి మైక్రోస్కోప్‌లో శక్తిగా కదులుతూ, నీటిలో ఈదే చిన్న చేపల్లా కనిపిస్తాయి. ఇవి వేగంగా ముందుకు కదులుతూ గర్భధారణకు అవసరమైన దిశగా ప్రయాణిస్తాయి. ఆరోగ్యకరమైన స్పెర్మ్‌ను చూసేటప్పుడు వాటి మార్ఫాలజీ (ఆకృతి), మోటిలిటీ (కదలిక) వంటి అంశాలను డాక్టర్లు పరీక్షిస్తారు.

అందుకే స్పెర్మ్ అనాలిసిస్ చేసే సమయంలో మైక్రోస్కోప్ ఉపయోగించడం చాలా ముఖ్యమైన దశ. ఇది ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారి కారణాల్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న పురుషులకు IUI ఎలా సహాయపడుతుంది?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post