Zero Sperm Count: జీరో స్పెర్మ్ కౌంట్ తో ప్రెగ్నెన్సీ సాధ్యమా? | Dr. Shashant, Pozitiv Andrology - Hyderabad

Zero Sperm Count: పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులలో కొందరికి ఎదురయ్యే పెద్ద సమస్యలలో ఒకటి జీరో స్పెర్మ్ కౌంట్ (Azoospermia). సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన పురుషుడి వీర్యంలో మిలియన్ల కొద్దీ స్పెర్మ్‌లు ఉంటాయి. కానీ "అజోస్పెర్మియా"లో వీర్యంలో ఒక్క స్పెర్మ్ కూడా ఉండదు. ఈ స్థితి వలన గర్భధారణ సాధ్యం కాదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది.


జీరో స్పెర్మ్ కౌంట్ అంటే ఏమిటి?

జీరో స్పెర్మ్ కౌంట్ అనేది పురుషుని వీర్యంలో స్రవించే ద్రవం ఉన్నా, అందులో స్పెర్మ్‌లు లేకపోవడమే. దీనికి రెండు రకాల కారణాలు ఉంటాయి.

  1. అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా - వీర్యాన్ని బయటికి పంపే మార్గాల్లో (వాస్ డిఫెరెన్స్, ఎపిడిడిమిస్) అడ్డంకి ఉండడం వలన స్పెర్మ్ బయటకు రాకపోవడం.
  2. నాన్-అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా - టెస్టిస్‌లో స్పెర్మ్ ఉత్పత్తి తక్కువగా లేదా లేకపోవడం.

జీరో స్పెర్మ్ కౌంట్ ఎందుకు వస్తుంది?

  • జన్యుపరమైన సమస్యలు (Chromosomal abnormalities)
  • వృషణాల (Testes) అభివృద్ధి లోపాలు
  • హార్మోన్ అసమతుల్యత (FSH, LH, Testosterone లో మార్పులు)
  • వృషణాలపై గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు
  • మునుపటి సర్జరీలు లేదా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ
  • ధూమపానం, మద్యం వంటి జీవనశైలి అలవాట్లు

జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు గర్భధారణ సాధ్యమేనా?

చాలా సందర్భాల్లో సాధ్యమే. కానీ అది సమస్య ఏ రకంగా ఉందో ఆధారపడి ఉంటుంది.

Also Read: స్పెర్మ్ కౌంట్ పూర్తిగా తగ్గడానికి ఈ అలవాట్లే కారణం!

1. అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా

  • ఈ పరిస్థితిలో వృషణాలు స్పెర్మ్‌లను తయారు చేస్తాయి కానీ అవి బయటకు రావు.
  • శస్త్రచికిత్స ద్వారా అడ్డంకి తొలగించవచ్చు లేదా TESE (Testicular Sperm Extraction), PESA (Percutaneous Epididymal Sperm Aspiration) వంటి పద్ధతులతో నేరుగా వృషణాల నుండి స్పెర్మ్ సేకరించవచ్చు.
  • సేకరించిన స్పెర్మ్‌ను IVF/ICSI (Intra Cytoplasmic Sperm Injection) పద్ధతిలో వాడి గర్భధారణ సాధించవచ్చు.

2. నాన్-అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా

  • ఈ పరిస్థితిలో స్పెర్మ్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది లేదా ఉండకపోవచ్చు.
  • హార్మోన్ థెరపీతో కొన్నిసార్లు స్పెర్మ్ ఉత్పత్తి పెరగవచ్చు.
  • మైక్రో TESE వంటి అధునాతన శస్త్రచికిత్స పద్ధతులు ఉపయోగించి కొద్ది స్పెర్మ్‌లను సేకరించి IVF/ICSI ద్వారా గర్భధారణ సాధించవచ్చు.
  • వీటితో కూడా ఫలితం రాకపోతే, డోనర్ స్పెర్మ్ (Donor sperm) ఉపయోగించి గర్భధారణ సాధించడం ఒక మార్గం.

మహిళా భాగస్వామి పాత్ర

పురుషునికి జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నా, మహిళా భాగస్వామి గర్భాశయం, అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే IVF, ICSI వంటి పద్ధతుల ద్వారా గర్భధారణ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి.

జీరో స్పెర్మ్ కౌంట్ అనేది పెద్ద సమస్య అయినప్పటికీ, ఆధునిక వైద్య శాస్త్రం వలన ఇది చివరి అడ్డంకి కాదు. సరైన నిర్ధారణ, అనుకూలమైన చికిత్స, IVF/ICSI వంటి ఆధునిక ఫెర్టిలిటీ టెక్నాలజీలు వలన పిల్లల కల నెరవేర్చుకోవచ్చు. కాబట్టి జీరో స్పెర్మ్ కౌంట్ అని నిరుత్సాహపడక, అనుభవజ్ఞులైన అండ్రాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్టును సంప్రదించడం చాలా ముఖ్యం.

Also Read: డెలివరీ తరువాత వెంటనే వెలుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Andrology Hyderabad

Post a Comment (0)
Previous Post Next Post