Uterine Polyps Causes: గర్భాశయంలో పాలిప్స్ ఎందుకు వస్తాయి?

Uterine Polyps Causes: గర్భాశయం (Uterus) స్త్రీ రీప్రొడక్టివ్ సిస్టంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇందులో జరిగే చిన్న మార్పులు కూడా స్త్రీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి గర్భాశయ పాలిప్స్ (Uterine Polyps). వీటిని ఎండోమెట్రియల్ పాలిప్స్ (Endometrial Polyps) అని కూడా పిలుస్తారు. ఇవి గర్భాశయంలోని లోపలి పొర (Endometrium) నుండి పెరిగే చిన్న మాంసపు ముక్కలు లేదా పెరిగిన కణజాలం. ఇవి సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ, కొన్నిసార్లు ఫర్టిలిటీ సమస్యలు లేదా ఇతర గైనకాలజికల్ ఇబ్బందులకు దారి తీస్తాయి.


పాలిప్స్ ఎందుకు వస్తాయి?

గర్భాశయంలో పాలిప్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతౌల్యం. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ (Estrogen) హార్మోన్ అధికంగా ఉన్నప్పుడు ఎండోమీట్రియల్ పొర అధికంగా పెరిగి పాలిప్స్ రూపంలో బయటపడుతుంది. 

ఈ సమస్యకు పలు కారణాలు ఉండవచ్చు:

  • హార్మోన్ల అసమతౌల్యం: ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఎండోమెట్రియం అధికంగా పెరుగుతుంది.
  • అధిక బరువు (Obesity): అధిక బరువు ఉన్నవారిలో హార్మోన్ అసమతౌల్యం ఎక్కువగా ఉంటుంది.
  • రక్తపోటు (Hypertension): హై బ్లడ్ ప్రెజర్ ఉన్న స్త్రీల్లో పాలిప్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
  • కొన్ని మందుల ప్రభావం: ప్రత్యేకించి హార్మోన్-ఆధారిత ఔషధాలు తీసుకుంటున్నవారిలో పాలిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
  • వయసు: 40-50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో పాలిప్స్ ఎక్కువగా కనిపిస్తాయి.

పాలిప్స్ వల్ల కలిగే సమస్యలు

గర్భాశయంలో పాలిప్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ లక్షణాలు కనిపించకపోవచ్చు. 

కానీ కొంతమంది మహిళల్లో:

  • అధికంగా లేదా అసమాన్యంగా రక్తస్రావం (Heavy or Irregular periods)
  • పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్
  • లైంగిక సంబంధం తర్వాత రక్తస్రావం
  • గర్భం ధరించడంలో ఇబ్బంది (Infertility)

వంటి సమస్యలు కనబడవచ్చు. కొన్నిసార్లు పాలిప్స్ పెద్దవిగా మారితే గర్భాశయంలో స్థలం తగ్గి, గర్భధారణ సరిగ్గా జరగకుండా చేస్తాయి.

ఎలా గుర్తించాలి?

గర్భాశయ పాలిప్స్‌ను గుర్తించడానికి గైనకాలజిస్ట్ కొన్ని పరీక్షలు చేస్తారు:

  • Ultrasound Scan: పాలిప్స్ స్థానం, పరిమాణం తెలుసుకోవడానికి.
  • Saline Infusion Sonography (SIS): గర్భాశయ గోడలోని అసాధారణ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.
  • Hysteroscopy: గర్భాశయం లోపలికి చిన్న కెమెరా పెట్టి నేరుగా పరిశీలించడం.

చికిత్స ఎలా ఉంటుంది?

పాలిప్స్ చిన్నవిగా, లక్షణాలు లేకుండా ఉంటే కొన్ని సార్లు చికిత్స అవసరం ఉండదు. కానీ ఎక్కువగా రక్తస్రావం, నొప్పి, గర్భం రాకపోవడం వంటి సమస్యలు ఉంటే Hysteroscopic Polypectomy అనే సర్జరీ ద్వారా పాలిప్స్ తొలగిస్తారు. ఇది సురక్షితమైన, తక్కువ సమయం పట్టే చికిత్స.

గర్భాశయంలో పాలిప్స్ సాధారణంగా పెద్ద సమస్య కాకపోయినా, అవి ఫర్టిలిటీ సమస్యలు మరియు రక్తస్రావానికి కారణమయ్యే అవకాశముంది. కాబట్టి, ఎలాంటి అనుమానాస్పద లక్షణాలు కనబడితే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం చాలా అవసరం. సరైన సమయంలో పరీక్షలు, చికిత్స తీసుకోవడం ద్వారా పాలిప్స్ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.

Also Read: ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫర్టిలిటీపై ఎలా ప్రభావం చూపుతుంది?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post