Semen Analysis Precautions: పిల్లలు కలగక ఇబ్బంది పడుతున్న దంపతులకు మొదట చేసే ముఖ్యమైన టెస్టుల్లో ఒకటి సెమన్ అనాలిసిస్ (Semen Analysis). ఈ టెస్ట్ ద్వారా పురుషులలో వీర్యకణాల సంఖ్య, కదలిక, ఆకారం, నాణ్యత వంటి విషయాలు తెలుసుకోవచ్చు. చాలా మందికి ఈ టెస్ట్ చేయించుకోవడంపై భయం లేదా సిగ్గు ఉంటుంది. కానీ ఇది చాలా సాధారణమైన పరీక్ష. సరైన రీతిలో నమూనా (Sample) ఇవ్వడం చాలా ముఖ్యం. లేకపోతే ఫలితాలు తప్పుగా రావచ్చు. కాబట్టి ఈ టెస్ట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి.
వీర్యం ఇవ్వడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అబ్స్టినెన్స్ (Abstinence): టెస్ట్ కి ముందు కనీసం 2 రోజులు నుండి గరిష్టంగా 5 రోజుల వరకు శృంగార సంబంధం పెట్టుకోకపోవాలి. ఇలా చేస్తే వీర్యకణాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
- ఆల్కహాల్ & స్మోకింగ్ నివారించాలి: టెస్ట్ కి ముందు ఆల్కహాల్, సిగరెట్లు లేదా ఏదైనా డ్రగ్స్ వాడకూడదు. ఇవి స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతాయి.
- మందులు: ఎలాంటి మందులు వాడుతున్నారో డాక్టర్ కి చెప్పాలి. కొన్ని మందులు స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతాయి.
- శరీర ఆరోగ్యం: జ్వరం, ఇన్ఫెక్షన్, స్ట్రెస్ వంటి పరిస్థితులు కూడా స్పెర్మ్ టెస్ట్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న సమయంలో టెస్ట్ చేయించుకోవడం మంచిది.
నమూనా ఎలా ఇవ్వాలి?
- సాధారణంగా హాస్పిటల్ లోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో మాస్టర్బేషన్ (హస్తప్రయోగం) ద్వారా వీర్య నమూనా ఇవ్వాలి.
- నమూనాను పూర్తిగా కప్పులో సేకరించడం చాలా ముఖ్యం. మొదటి భాగం (Initial portion) తప్పిపోతే ఫలితాలు తప్పుగా రావచ్చు.
- వీలైతే నమూనాను హాస్పిటల్ లో ఇవ్వడమే మంచిది. కానీ ఎవరికి అసౌకర్యం అనిపిస్తే, డాక్టర్ అనుమతితో ఇంట్లో సేకరించి 30-45 నిమిషాల్లో ల్యాబ్ కి అందించాలి.
నమూనా ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విషయాలు
- లూబ్రికెంట్స్, ఆయిల్స్, కండోమ్స్ వాడరాదు. ఇవి నమూనాను కలుషితం చేస్తాయి.
- చేతులు బాగా కడుక్కోవాలి, శుభ్రంగా ఉండాలి.
- నమూనా ఇచ్చిన తర్వాత కప్పును గట్టిగా మూసి వెంటనే ల్యాబ్ కి అందించాలి.
ఎందుకు ఇంత జాగ్రత్త?
సెమన్ అనాలిసిస్ ఫలితాల ఆధారంగానే డాక్టర్ ముందుగానే పురుషులలో ఉన్న Infertility కారణాలను గుర్తించి సరైన చికిత్సను ప్రారంభిస్తారు. స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ (కదలిక), మార్ఫాలజీ (ఆకారం), ద్రవం లక్షణాలు అన్నీ కచ్చితంగా రావాలంటే నమూనా సరైన విధంగా ఇవ్వాలి.
స్పెర్మ్ టెస్ట్ అనేది కేవలం ఒక సాధారణ పరీక్ష మాత్రమే. దానిని సిగ్గుపడకుండా, సరైన జాగ్రత్తలతో నమూనా ఇచ్చినప్పుడే ఫలితాలు కచ్చితంగా వస్తాయి.
పురుషుల ఫెర్టిలిటీకి సంబంధించిన అన్ని రకాల ఆధునిక పరీక్షలు మరియు చికిత్సల కోసం Pozitiv Fertility Hyderabad లోని Dr. Shashant S (Surgeon & Andrologist) గారిని సంప్రదించవచ్చు.
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Andrology Hyderabad