Masturbation: మాస్టర్బేషన్ అంటే వ్యక్తి తాను లైంగికంగా సంతృప్తి పొందే ప్రక్రియ. ఇది ఆరోగ్యానికి హానికరమా? స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం ఉంటుందా? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ప్రత్యేకంగా బిడ్డలు కావాలని ప్రయత్నిస్తున్న దంపతుల్లో ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.
![]() |
Masturbation and Male Fertility |
స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం:
1. తాత్కాలిక ప్రభావం ఉండవచ్చు: తరచూ మాస్టర్బేషన్ చేయడం వల్ల ఒక్కో సారి స్పెర్మ్ వాల్యూమ్ తక్కువగా కనిపించవచ్చు. కానీ ఇది శాశ్వత సమస్య కాదు. స్పెర్మ్ కౌంట్ కొన్ని గంటల లేదా రోజుల్లో మళ్లీ మామూలు స్థాయికి చేరుతుంది.
2. శరీరానికి స్పెర్మ్‌ను రీప్లేస్ చేయడంలో సమయం అవసరం: రోజులో ఎక్కువసార్లు మాస్టర్బేషన్ చేస్తే శరీరానికి స్పెర్మ్‌ను తిరిగి ఉత్పత్తి చేయడానికి సరైన సమయం ఉండదు. దీని వల్ల తాత్కాలికంగా కౌంట్ తక్కువగా ఉంటుంది.
3. శాశ్వతంగా స్పెర్మ్ కౌంట్ తగ్గదు: ఆరోగ్యంగా ఉన్న పురుషుల్లో, మాస్టర్బేషన్ వల్ల శాశ్వతంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం సాధ్యపడదు. శరీరం తనకు అవసరమైన స్పెర్మ్‌ను నిరంతరం ఉత్పత్తి చేస్తుంటుంది.
Also Read: ఆరోగ్యకరమైన వీర్యం యొక్క కనీస పారామీటర్లు ఏంటి?
ఎప్పుడు ప్రమాదంగా మారుతుంది?
4. చిన్న విరామాల్లో, అదుపు లేకుండా చేస్తే: దీనివల్ల మానసిక అలసట, శారీరక నీరసం, నెగటివ్ ఎమోషన్లు రావచ్చు. దీని యొక్క పర్యావసానం స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది.
5. సెక్స్యువల్ డిసార్డర్స్‌కి అవకాశం: ఎక్కువ మాస్టర్బేషన్ చేయడం వల్ల కొన్నిసార్లు ముందే వీర్యస్కలనం (premature ejaculation), లిబిడో తగ్గిపోవడం వంటి సమస్యలు రావొచ్చు.
6. పోర్న్ ఎక్కువ చూడటం: దానికి అలవాటుపడటం వాళ్ళ నేరుగా స్పెర్మ్ క్వాలిటీ పైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని శారీరక పనితీరు తగ్గుతుంది.
7. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం: వారానికి 2–3 సార్లు మాస్టర్బేషన్ చేయడం సాధారణమే. దీని వల్ల ఎటువంటి ఫెర్టిలిటీ సమస్య ఉండదు.
8. పురుషుడి స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ప్రధాన కారణాలు:
- వరికోసిల్
- హార్మోనల్ ఇమ్బాలెన్స్
- పొగతాగడం, మద్యం
- తీవ్రమైన ఒత్తిడి
మంచి అలవాట్లతో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుంది:
9. సరైన డైట్: శారీరక వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ లెస్ జీవితం ఇవన్నీ స్పెర్మ్ క్వాలిటీ మెరుగుపరిచే అంశాలు.
10. కంట్రోల్ లో ఉండటం: మాస్టర్బేషన్ ను లిమిట్స్ లో చేసుకుంటే ఆరోగ్యానికి హానికరం కాదు.
మాస్టర్బేషన్ ఎక్కువగా చేయడం వల్ల శాశ్వతంగా స్పెర్మ్ కౌంట్ తగ్గదు. కానీ అదుపు లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తే మానసిక, శారీరక ప్రభావాలు కలగవచ్చు.
Also Read: పురుషుల్లో ఒబేసిటీ ఉంటే స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility