Male Infertility Treatment: మగవారిలో ఇన్‌ఫెర్టిలిటీకి మందులు లేదా సర్జరీ ద్వారా చికిత్స చేస్తారా?

Male Infertility Treatment: మగవారిలో ఇన్‌ఫెర్టిలిటీకి కారణాలు అనేకంగా ఉండొచ్చు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, స్పెర్మ్ మోటిలిటీ బలహీనంగా ఉండటం, హార్మోనల్ అసమతుల్యత, వయసు పెరగడం, వంశపారంపర్య సమస్యలు, వరికోసిల్ వంటి సమస్యలు మొదలైనవన్నీ ఫెర్టిలిటీపై ప్రభావం చూపిస్తాయి. అలాంటప్పుడు చికిత్స విధానం కూడా వ్యక్తిగత పరిస్థితికి అనుగుణంగా నిర్ణయించబడుతుంది.

Male Infertility Treatment
Male Infertility Treatment

మందులతో చికిత్స:

  • హార్మోన్లు అసమతుల్యంలో టెస్టోస్టెరాన్ బూస్టింగ్ మందులు, లేదా FSH / LH థెరపీ ఉపయోగిస్తారు.
  • స్పెర్మ్ కౌంట్ మరియు మోటిలిటీ మెరుగయ్యేలా యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్స్ (CoQ10, Zinc, Vitamin C, Vitamin E) ఇస్తారు.
  • మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయోటిక్స్ ఇవ్వవచ్చు.
  • సర్జరీతో చికిత్స: వరికోసిల్ వంటి శారీరక సమస్యలు ఉన్నప్పుడు, వరికోసిలెక్టమీ అనే సర్జరీ చేస్తారు.
  • Obstructive azoospermia (స్పెర్మ్ ఉత్పత్తి అయినా బయటికి రాని పరిస్థితి) ఉన్నప్పుడు, vasovasostomy, epididymovasostomy లాంటి సర్జరీలు చేస్తారు.
  • కొన్ని సందర్భాల్లో TESE / PESA / TESA లాంటి స్పెర్మ్ retrieval ప్రొసీడ్యూల్స్ ద్వారా స్పెర్మ్ తీసుకొని IVF/ICSI వంటి టెక్నిక్స్‌కి ఉపయోగిస్తారు.

ఇన్‌ఫెర్టిలిటీకి చికిత్స పూర్తి స్థాయిలో సాధ్యమే. అయితే చికిత్స మందులతో ఉండాలా, లేక శస్త్రచికిత్స కావాలా అనే విషయం ఇన్ఫెర్టిలిటీ కారణంపై ఆధారపడి ఉంటుంది. అందుకే, స్పెర్మ్ అనాలసిస్, హార్మోన్ టెస్టింగ్, స్కాన్ వంటి టెస్టులు పూర్తి చేసుకుని, అనుభవజ్ఞుడైన యూరోలాజిస్టు లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్టు సలహాతో ముందడుగు వేయడం ఉత్తమం.

Also Read: బైక్ నడపడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందా?

మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility

Post a Comment (0)
Previous Post Next Post