Multiple Pregnancy with IVF: ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (In Vitro Fertilization - IVF) ట్రీట్మెంట్ గురించి చాలా మంది జంటలకు ఒక సాధారణ సందేహం ఉంటుంది “IVF వల్ల కవల పిల్లలు పుడతారా?” అనేది. ఈ ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకోవాలంటే ముందుగా IVF ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి.
IVF లో మహిళ నుంచి ఎగ్స్ (అండాలు) తీసుకొని, పురుషుడి స్పెర్మ్‌తో ల్యాబ్‌లో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ ఎంబ్రియోలను గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సాధారణంగా ఒకే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే ఒకే బిడ్డ పుడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ అవకాశాలు రావాలని, లేదా సక్సెస్ రేటు పెరగాలని 2-3 ఎంబ్రియోలు ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో, ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎంబ్రియోలు గర్భాశయంలో ఇంప్లాంట్ అయితే కవలలు లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కలగొచ్చు. అందువల్ల IVF లో కవల పిల్లలు పుట్టే అవకాశం నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (SET) అనే పద్ధతి చాలా సెంటర్లలో ప్రోత్సహిస్తున్నారు. ఇది సురక్షితంగా ఉంటుంది, అలాగే complications తగ్గిస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి ఆరోగ్యానికి మరియు పిల్లల ఆరోగ్యానికి కొన్ని రిస్క్‌లు ఉంటాయి. ఉదాహరణకు, ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు పుట్టడం, హై బ్లడ్ ప్రెజర్ లేదా గెస్టేషనల్ డయాబెటిస్ రావడం వంటి సమస్యలు.
డాక్టర్ సలహా ఆధారంగా ఎన్ని ఎంబ్రియోలు ట్రాన్స్‌ఫర్ చేయాలో నిర్ణయిస్తారు. చిన్న వయసులో ఉన్న, మంచి ఎగ్ మరియు స్పెర్మ్ క్వాలిటీ ఉన్న మహిళల్లో సాధారణంగా ఒకే ఎంబ్రియో పెట్టడమే చేస్తారు. కానీ వయసు ఎక్కువైనవారు లేదా పూర్వంలో IVF ప్రయత్నం విఫలమైన వారు అయితే, విజయావకాశాలు పెరగడానికి రెండు ఎంబ్రియోలు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుంది.
IVF వల్ల కవల పిల్లలు పుడే అవకాశం సహజ గర్భధారణతో పోలిస్తే ఎక్కువే. కానీ ఇది తప్పనిసరిగా జరుగుతుందని కాదు. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ సంఖ్య, తల్లి ఆరోగ్యం, వయసు, వైద్య పరిస్థితులు అన్నీ కలిపి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే IVF ప్రక్రియలో కవల పిల్లల అవకాశాల గురించి డాక్టర్‌తో స్పష్టంగా మాట్లాడి, వారి సూచనలను పాటించడం చాలా ముఖ్యం.
Also Read: గర్భిణీల్లో నిద్రలేమికి అసలైన కారణాలు!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility