Understanding Sperm Count Reports: పిల్లలు కనడానికి ప్రయత్నిస్తున్న దంపతుల్లో చాలామంది పురుషులు ముందుగా స్పెర్మ్ టెస్ట్ చేయించుకుంటారు. ఈ టెస్టును సెమెన్ అనాలిసిస్ (Semen Analysis) అని కూడా అంటారు. శుక్రకణాల (Sperm) సంఖ్య, నాణ్యత, కదలిక, ఆకారం వంటి అంశాలను పరీక్షించడం ద్వారా ఫర్టిలిటీ స్థాయిని అంచనా వేయడం జరుగుతుంది. కానీ చాలా సార్లు రిపోర్ట్ చూసిన తర్వాత గందరగోళం వస్తుంది. ఏది సరిగ్గా ఉందో, ఏది సమస్యో అర్థం కాకపోవడం సహజం.
స్పెర్మ్ టెస్ట్‌లో పరిశీలించే అంశాలు
స్పెర్మ్ టెస్ట్‌లో నాలుగు ముఖ్యమైన పారామీటర్లు పరిశీలిస్తారు:
- స్పెర్మ్ కౌంట్: 1 మిల్లీ లీటర్ వీర్య ద్రవంలో ఎన్ని శుక్రకణాలు ఉన్నాయని.? సాధారణంగా 15 మిలియన్లకు పైగా ఉండాలి.
- మోటిలిటీ (Motility): శుక్రకణాలు ఎంత వేగంగా, ఏ దిశలో కదులుతున్నాయని.? కనీసం 40% కదలిక సాధారణంగా పరిగణించబడుతుంది.
- మార్ఫాలజీ (Morphology): శుక్రకణాల ఆకారం, నిర్మాణం ఎలా ఉన్నాయని.? కనీసం 4% శుక్రకణాలు సాధారణ ఆకారంలో ఉండాలి.
- వాల్యూమ్ (Volume): ఒకసారి విడుదలైన వీర్యం పరిమాణం ఎంత ఉందని.? కనీసం 1.5 ml ఉండాలి.
గందరగోళం కలిగించే పరిస్థితులు
- కౌంట్ సరిగ్గా ఉన్నా, కదలిక తక్కువగా ఉండడం - కౌంట్ బాగానే ఉన్నా స్పెర్మ్ కదలకపోతే ఫర్టిలిటీకి సమస్య అవుతుంది.
- కదలిక బాగానే ఉన్నా, ఆకారం సరిగ్గా లేకపోవడం - దీనివల్ల ఎగ్ లోకి స్విమ్ చేసే శక్తి తగ్గుతుంది.
- వాల్యూమ్ తక్కువగా ఉండడం - మొత్తం రిపోర్ట్ మీద ప్రభావం చూపుతుంది.
- మిక్స్‌డ్ రిపోర్ట్ - కొన్నిసార్లు ఒక పారామీటర్ బాగుంటే, ఇంకోది సరిగా ఉండదు. దీనివల్ల ఫలితాలు అర్థం కాక గందరగోళం కలుగుతుంది.
- జీవనశైలి (స్మోకింగ్, మద్యం, నిద్రలేమి, స్ట్రెస్)
- హార్మోన్ అసమతుల్యత
- ఇన్ఫెక్షన్లు
- వేరికోసిల్ (వృషణాల సమస్యలు)
- శరీర బరువు ఎక్కువ కావడం (ఒబెసిటీ)
- డాక్టర్ గైడెన్స్ తప్పనిసరి: రిపోర్ట్‌ను స్వయంగా అర్థం చేసుకోవడం కష్టమే. అందుకే నిపుణుడైన యూరాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదించడం మంచిది.
- రిపీట్ టెస్ట్: ఒకసారి టెస్ట్ ఫలితమే చివరి నిర్ణయం కాదు. 2-3 వారాల గ్యాప్‌తో మళ్లీ టెస్ట్ చేయించడం అవసరం.
- జీవనశైలి మార్పులు: ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, పొగ త్రాగడం మానేయడం, స్ట్రెస్ తగ్గించడం ద్వారా ఫలితాలు మెరుగుపడతాయి.
- మెడికల్ ట్రీట్మెంట్స్: డాక్టర్ సూచనల ప్రకారం మందులు, హార్మోన్ థెరపీ లేదా అవసరమైతే IVF, ICSI వంటి పద్ధతులు అవలంబిస్తారు.