Most-Asked Questions About Fertility: ఫర్టిలిటీ సమస్యలు ప్రస్తుతం చాలా జంటలు ఎదుర్కొంటున్న ప్రధానమైన హెల్త్ ఇష్యూలలో ఒకటి. IVF (In Vitro Fertilization), IUI (Intrauterine Insemination) వంటి ట్రీట్మెంట్లు చాలా మందికి కొత్తగా అనిపించినా, ఇవి సైన్స్ ఆధారితంగా ఉన్న సేఫ్ ఆప్షన్స్. కానీ వీటి గురించి అనేక సందేహాలు, భయాలు, అపోహలు జంటల్లో కనిపిస్తాయి. ఆ సందేహాలన్నింటికి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శశి ప్రియ (Dr. Sasi Priya) గారు ఇచ్చిన క్లారిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
1. IVF ప్రక్రియ సక్సెస్ రేట్: IVF సక్సెస్ రేటు వయస్సు, హెల్త్ కన్డిషన్స్, ఎంబ్రియో క్వాలిటీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల లోపు మహిళల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గడం వల్ల సక్సెస్ రేటు కూడా తగ్గుతుంది.
2. PCOS / PCOD ఉన్నవారి IVF సక్సెస్ రేట్ & 35 ఏళ్ల తర్వాత IVF: PCOS/PCOD ఉన్న మహిళలకు IVF మంచి ఆప్షన్. సరైన మెడికేషన్, హార్మోనల్ బ్యాలెన్స్, లైఫ్‌స్టైల్ కంట్రోల్‌తో IVF సక్సెస్ రేటు మెరుగవుతుంది. అయితే 35 ఏళ్లు దాటితే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. అంతేకాకుండా IVF సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. అందుకే తొందరగా ట్రీట్మెంట్ ప్రారంభించడం మంచిది.
3. నిద్ర ప్రాధాన్యం: హార్మోన్ల ప్రొడక్షన్, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ హెల్త్ అన్నీ నిద్ర మీద ప్రభావం చూపుతాయి. ప్రతి రోజూ కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. నైట్ షిఫ్ట్‌లు లేదా ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హాబిట్స్ ఫర్టిలిటీపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
4. లైఫ్‌స్టైల్ మార్పులు: స్ట్రెస్, ధూమపానం, మద్యపానం, అలసట ఇవన్నీ సంతానలేమికి దోహదపడే అలవాట్లు. హెల్దీ లైఫ్‌స్టైల్, యాక్టివ్ రూటీన్, స్ట్రెస్ ఫ్రీ మైండ్ IVF సక్సెస్ రేటును పెంచుతాయి.
5. హైడ్రేషన్: శరీరానికి తగినంత నీరు తాగడం ఫర్టిలిటీకి చాలా ఉపయోగకరం. డీహైడ్రేషన్ వల్ల హార్మోన్ల ఇంబ్యాలెన్స్, మెటబాలిజం స్లో అవడం జరుగుతుంది. రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది.
Also Read: స్పెర్మ్ టెస్ట్ రిపోర్టుల్లో గందరగోళం ఎప్పుడు వస్తుంది? ఎలా అర్థం చేసుకోవాలి?
6. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: Balanced diet అంటే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ వాడకాన్ని తగ్గించాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఫర్టిలిటీకి మంచివి.
7. వ్యాయామం: రెగ్యులర్ వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. బరువు కంట్రోల్‌లో ఉంటుంది. PCOS ఉన్న మహిళలకు వాకింగ్, యోగా, లైట్ ఎక్సర్‌సైజ్‌లు చాలా హెల్ప్ చేస్తాయి. అయితే ఓవర్ ఎక్సర్‌సైజ్ చేయడం కూడా ఫర్టిలిటీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
8. ఎగ్ ఫ్రీజింగ్: చిన్న వయసులో ఉన్న మహిళలు భవిష్యత్తులో గర్భధారణ ప్లాన్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కెరీర్ కారణాల వల్ల డిలే చేయాలనుకునే వారికి సరైన ఆప్షన్.
9. స్పెర్మ్ ఫ్రీజింగ్: స్పెర్మ్ ఫ్రీజింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా వయస్సు పెరుగుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఫాదర్ అవ్వాలనుకునే పురుషులకు ఇది సురక్షితమైన పద్ధతి.
10. IUI & IVF తేడా:
- IUI: సాధారణంగా స్పెర్మ్‌ను డైరెక్ట్‌గా యుటెరస్‌లో ఇంజెక్ట్ చేస్తారు. ఇది మొదటి స్టేజ్ ట్రీట్మెంట్.
- IVF: ఎగ్స్‌ను ల్యాబ్‌లో ఫెర్టిలైజ్ చేసి ఎంబ్రియోగా మార్చి, తిరిగి గర్భాశయంలో ఇంప్లాంట్ చేస్తారు. ఇది అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్.
11. డైటింగ్ & వెయిట్ లాస్ ప్రభావం: ఎక్కువ డైటింగ్, ఫ్యాడ్ డైట్స్ ఫర్టిలిటీని దెబ్బతీస్తాయి. హెల్దీ వెయిట్ లాస్ మాత్రమే ఫర్టిలిటీకి సపోర్ట్ చేస్తుంది. అతి బరువు, తక్కువ బరువు రెండూ గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి.
12. IVF వల్ల కవలలు, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వస్తుందా?
IVFలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఎంబ్రియోలు ఇంప్లాంట్ చేస్తే కవలలు లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశముంది. అయితే ఇప్పుడు చాలామంది డాక్టర్లు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌నే ప్రిఫర్ చేస్తున్నారు.
ఫర్టిలిటీ సమస్యలు భయపడాల్సిన అవసరం లేదు. సైన్స్ ఆధారిత ట్రీట్మెంట్లు, హెల్తీ లైఫ్‌స్టైల్, సరైన మెడికల్ గైడెన్స్ ఉంటే, ప్రతి జంటకీ సంతాన సాఫల్యం సాధ్యమే.
Also Read: ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ చేయించుకుంటే కవల పిల్లలు పుడతారా?
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility