Saline Infusion Sonography (SIS): స్త్రీలలో గర్భధారణ జరగడానికి ఫెలోపియన్ ట్యూబ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ట్యూబ్స్ ద్వారానే అండం (Egg) మరియు స్పెర్మ్ కలిసిపోతాయి. కానీ ట్యూబ్స్ బ్లాక్ అయితే, అండం స్పెర్మ్‌ను కలవదు. ఫలితంగా సహజంగా గర్భధారణ జరగదు. ఇలాంటి సందర్భాల్లో ట్యూబ్స్ ఓపెన్‌గా ఉన్నాయా? లేక బ్లాక్ అయ్యాయా? అని తెలుసుకోవడానికి ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
Saline Infusion Sonography (SIS) టెస్ట్ అంటే ఏమిటి?
SIS టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ ఆధారిత పరీక్ష. ఇందులో యుటెరస్ లోకి సలైన్ (ఉప్పునీటి ద్రావణం) ను నెమ్మదిగా ఇన్జెక్ట్ చేస్తారు. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ తో గర్భాశయాన్ని, ట్యూబ్‌లను స్పష్టంగా పరిశీలిస్తారు.
ఈ టెస్ట్ ద్వారా:
ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్‌గా ఉన్నాయా లేదా బ్లాక్ అయ్యాయా అని తెలుసుకోవచ్చు.
గర్భాశయం లోపలి ఆకృతి సరిగా ఉందా అని కూడా చెక్ చేయవచ్చు.
ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎండోమెట్రియల్ సమస్యలు వంటివి ఉన్నాయా అనే సమాచారం లభిస్తుంది.
SIS టెస్ట్ ఎలా చేస్తారు?
డా. శశి ప్రియ గారి వివరణ ప్రకారం ఈ టెస్ట్ చాలా సింపుల్, తక్కువ టైమ్ పట్టే విధంగా జరుగుతుంది.
- మహిళను పరీక్ష కోసం సిద్ధం చేస్తారు.
- ఒక చిన్న ట్యూబ్ ద్వారా సలైన్ ద్రావణం ను గర్భాశయంలోకి నింపుతారు.
- అదే సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ట్యూబ్‌లు, యుటెరస్ లోపలి భాగాన్ని క్లియర్‌గా పరిశీలిస్తారు.
- ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు సుమారు 15–20 నిమిషాలు మాత్రమే పడుతుంది.
Also Read: ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏమిటి?
SIS టెస్ట్ ప్రయోజనాలు
- ఇది సర్జరీ అవసరం లేకుండా చేసే సులభమైన టెస్ట్.
- రోగికి ఎటువంటి పెద్ద నొప్పి లేదా ఇబ్బంది ఉండదు.
- హార్మోన్ల వాడకం లేకుండా, ప్రాక్టికల్‌గా సురక్షితమైన పరీక్ష.
- గర్భాశయం లోపలి సమస్యలను కూడా ఒకేసారి గుర్తించవచ్చు.
ఎప్పుడు ఈ టెస్ట్ చేయాలి?
- సంతానం కోసం ట్రై చేస్తున్నా, సహజంగా గర్భం రాకపోతే.
- డాక్టర్‌కి ట్యూబ్ బ్లాకేజ్ అనుమానం ఉన్నప్పుడు.
- IVF లేదా IUI వంటి ట్రీట్మెంట్స్ కు ముందు, యుటెరస్ & ట్యూబ్స్ హెల్త్ చెక్ చేయడానికి.
ట్యూబ్ బ్లాకేజ్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి?
- ఒకే ట్యూబ్ బ్లాక్ అయితే, సహజ గర్భధారణ అవకాశాలు ఇంకా ఉంటాయి.
- రెండు ట్యూబ్స్ బ్లాక్ అయితే, IVF (Test Tube Baby) ఉత్తమమైన ఆప్షన్ అవుతుంది.
- Hydrosalpinx వంటి సమస్య ఉంటే, IVF ముందు ట్యూబ్‌ను క్లోజ్ చేయడం లేదా తొలగించడం అవసరం.
డాక్టర్ సశి ప్రియ గారి సూచన
“ట్యూబ్ బ్లాకేజ్ అనేది స్త్రీలలో చాలా సాధారణ సమస్య. కానీ SIS వంటి ఆధునిక టెస్టులతో దీన్ని త్వరగా, సులభంగా డయగ్నోస్ చేయవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా, గర్భధారణ అవకాశాలు కోల్పోకుండా ముందుకు వెళ్ళవచ్చు.”
Saline Infusion Sonography (SIS) టెస్ట్ అనేది ట్యూబ్స్ హెల్త్ తెలుసుకోవడానికి, గర్భాశయం లోపలి సమస్యలు గుర్తించడానికి చాలా ఉపయోగకరమైన పరీక్ష. సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు, ముఖ్యంగా గర్భధారణలో ఆలస్యం అవుతున్నవారు ఈ టెస్ట్ తప్పక చేయించుకోవాలి.
Also Read: రెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? దీనివల్ల మీ అంగం ఫాస్ట్ గా మెత్తబడుతుందా!
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Fertility