Premature Ejaculation: పురుషులలో ఎక్కువగా కనిపించే ఒక లైంగిక సమస్య ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ (PE). అంటే లైంగిక సంబంధం ప్రారంభమైన కొద్ది సేపటికే, లేదా కేవలం లోపల పెట్టిన వెంటనే వీర్యస్ఖలనం (ejaculation) జరగడం. ఇది కేవలం ఒకసారి మాత్రమే జరిగితే పెద్ద సమస్య కాదు. కానీ, తరచుగా జరిగితే అది జంటల దాంపత్య జీవితం, భావోద్వేగాలు, మరియు ముఖ్యంగా ఫెర్టిలిటీపై ప్రభావం చూపిస్తుంది.
కారణాలు ఏమిటి?
ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది శారీరక, మానసిక కారణాల వలన వస్తుంది.
- సైకలాజికల్ కారణాలు - ఆత్మవిశ్వాసం లోపం, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, కొత్తగా వివాహం అయిన జంటల్లో భయం.
- ఫిజికల్ కారణాలు - హార్మోన్ అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు, ప్రోస్టేట్ ఇన్‌ఫ్లమేషన్, న్యూరాలజికల్ సమస్యలు.
- లైఫ్‌స్టైల్ కారణాలు - అధిక మద్యపానం, ధూమపానం, నిద్రలేమి, శారీరకంగా చురుకుదనం లేకపోవడం.
Also Read: ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? దీనివల్ల మీ అంగం ఫాస్ట్ గా మెత్తబడుతుందా!
ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఫెర్టిలిటీపై ప్రభావం
- స్పెర్మ్ యోనిలో సరైన స్థలానికి చేరకపోవడం - వీర్యం అతి తొందరగా బయటికి రావడం వల్ల, గర్భధారణ జరిగే అవకాశాలు తగ్గుతాయి.
- జంటల్లో నిరాశ - సంబంధంలో ఇరువురూ అసంతృప్తిగా ఉండడం వల్ల, లైంగిక జీవితం కష్టమవుతుంది.
- వీర్యం క్వాలిటీ తగ్గడం - తరచుగా అజాగ్రత్తగా ఎజాక్యులేషన్ జరగడం వల్ల స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ కూడా ప్రభావితం అవుతుంది.
- సైకలాజికల్ బ్లాక్ - గర్భధారణ ప్రయత్నాల్లో దంపతులు నిస్పృహకు గురై, చికిత్సపై దృష్టి పెట్టలేకపోవచ్చు.
చికిత్స ఎలా ఉంటుంది?
డా. శశాంత్ గారు చెబుతున్నట్టు, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కు పూర్తి పరిష్కారం ఉంది.
- లైఫ్‌స్టైల్ మార్పులు - వ్యాయామం, యోగా, ధ్యానం, మద్యం & స్మోకింగ్ మానుకోవడం.
- మెడికేషన్ - కొన్ని ఔషధాలు (oral medicines, topical creams) ద్వారా ఎజాక్యులేషన్ సమయాన్ని కంట్రోల్ చేయవచ్చు.
- కౌన్సిలింగ్ & థెరపీ - సెక్స్ థెరపీ, బిహేవియర్ టెక్నిక్స్ (stop-start, squeeze method) ద్వారా స్లోగా కంట్రోల్ పెంచుకోవచ్చు.
- ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ - IUI, IVF, ICSI వంటి అధునాతన చికిత్సల ద్వారా స్పెర్మ్ ని సరిగ్గా ఉపయోగించి గర్భధారణ సాధ్యమవుతుంది.
జంటలకు సూచనలు
- ఇది ఒక సాధారణ సమస్య, చాలామందిలో కనిపిస్తుంది.
- నొచ్చుకోకుండా, సిగ్గు పడకుండా ఆండ్రాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి.
- తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే, గర్భధారణ విజయావకాశాలు పెరుగుతాయి.
ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కేవలం ఒక లైంగిక సమస్య మాత్రమే కాదు, గర్భధారణలో కూడా అడ్డంకిగా మారవచ్చు. అయితే, సరైన డయగ్నోసిస్, చికిత్స, జీవనశైలి మార్పులు ఉంటే ఇది పూర్తిగా కంట్రోల్ చేయగలిగే సమస్య.
Also Read: బేబీ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అలవాట్లు మానుకోండి
మరింత సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Pozitiv Andrology Hyderabad