Natural Tips for Pregnancy: సహజంగా గర్భం పొందడం ఎలా? - Dr. Sasi Priya

Natural Tips for Pregnancy: ప్రతి దంపతులకూ తల్లిదండ్రులుగా మారడం ఒక అందమైన అనుభవం. కానీ కొన్ని సందర్భాల్లో గర్భం పొందడం అంత సులభం కాదు. అయితే వైద్య చికిత్సలు లేకుండానే కొన్ని జీవనశైలీ మార్పులు, ఆహార అలవాట్లు, సరైన సమయ జ్ఞానం ఉంటే సహజంగా గర్భం పొందే అవకాశాలు పెరుగుతాయి.


మొదటగా, మహిళల మెనస్ట్రుయల్ సైకిల్ (పీరియడ్ సైకిల్) గురించి అవగాహన చాలా అవసరం. సాధారణంగా 28 రోజుల సైకిల్ ఉన్న మహిళల్లో 14వ రోజు అండం విడుదల (ovulation) జరుగుతుంది. ఈ సమయానికి ముందు 2 రోజులు, తరువాత 2 రోజులు కలిసి దంపతులు శారీరక సంబంధం పెట్టుకుంటే గర్భం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ‘fertile window’ ను గుర్తించడం ముఖ్యమైంది.

Also Read: ప్రెగ్నెన్సీలో వాంతులు ఎందుకు వస్తాయి?

ఆహారంలో సజ్జలు, పెసలు, పాలు, బాదం, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. అలాగే, తగినంత నీరు తాగడం ద్వారా శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్తాయి.

అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం ద్వారా ఫర్టిలిటీ మెరుగుపడుతుంది. PCOS, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే ముందుగా వాటిని కంట్రోల్ చేయాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించి, మహిళల్లో అండాశయ పనితీరును దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని పూర్తిగా మానేయాలి.

రోజువారీ జీవనశైలిలో వ్యాయామం తప్పనిసరి. రోజుకు కనీసం 30 నిమిషాలు brisk walking లేదా యోగా చేయడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. స్ట్రెస్ కూడా గర్భధారణలో పెద్ద అడ్డంకి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, సంగీతం, పాజిటివ్ ఆలోచనలు అలవాటు చేసుకోవాలి.

ముఖ్యంగా, దంపతులు ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేయడం చాలా అవసరం. గర్భం రావడంలో స్త్రీకి మాత్రమే కాదు, పురుషుడి ఫర్టిలిటీకి కూడా సమాన ప్రాధాన్యం ఉంది. కాబట్టి రెగ్యులర్ చెక్‌ప్‌లు చేయించుకోవడం, అవసరమైతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. సరిగ్గా ఆహారం, మంచి నిద్ర, స్ట్రెస్ లేకుండా జీవనం, సరైన సమయాన శారీరక సంబంధం ఇవన్నీ సహజంగా గర్భం పొందడానికి కీలక అంశాలు. మీ శరీరాన్ని అర్థం చేసుకోండి, సహనం పాటించండి సహజ గర్భధారణ తప్పక సాధ్యమవుతుంది.


Post a Comment (0)
Previous Post Next Post