Does PCOD Affect Pregnancy: PCOD ఉంటే పిల్లలు పుట్టరా? - Dr. Sasi Priya

Does PCOD Affect Pregnancy: చాలా మంది మహిళలు “PCOD ఉన్నవారికి పిల్లలు పుట్టవు” అనే అపోహతో భయపడుతుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. PCOD (Polycystic Ovarian Disease) అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే సమస్య. ఇది మహిళలస్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ (Female Reproductive System) పై ప్రభావం చూపినా, సరైన చికిత్స, ఆహారం, జీవనశైలి మార్పులతో గర్భం దాల్చడం పూర్తిగా సాధ్యమే. ఇప్పుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.


PCOD అంటే ఏమిటి?

PCOD అంటే “Polycystic Ovarian Disease”. ఈ పరిస్థితిలో మహిళల అండాశయాల్లో (Ovaries) చిన్న చిన్న సిస్టులు ఏర్పడుతాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి. ఫలితంగా అండోత్పత్తి (Ovulation) సక్రమంగా జరగదు, తద్వారా గర్భధారణ అవకాశాలు తక్కువగా ఉంటాయి.

PCOD వల్ల గర్భధారణ ఎందుకు కష్టమవుతుంది?

PCOD ఉన్న మహిళల్లో అండాలు పక్వం (Mature) అవ్వకపోవడం లేదా విడుదల కాకపోవడం (Anovulation) ప్రధాన కారణం. అలాగే ఈ సమస్య వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు, అధిక బరువు, ఇర్రేగ్యులర్ పీరియడ్స్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కారణాల వల్ల గర్భం దాల్చే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ అసాధ్యం కాదు.

Also Read: ఆయుర్వేద చికిత్సతో సంతానం కలుగుతుందా? - Dr. Sasi Priya

PCOD ఉన్నవారికి గర్భం రావడం అసాధ్యమా?

PCOD ఉన్న అనేక మంది మహిళలు సరైన చికిత్స తీసుకుని గర్భం దాల్చారు, ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చారు కూడా.

డాక్టర్ సూచించిన విధంగా లైఫ్ స్టైల్ మార్చుకోవడం, బరువు తగ్గడం, సరైన మందులు తీసుకోవడం, ఓవులేషన్ ట్రాకింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటే గర్భం దాల్చడం పూర్తిగా సాధ్యమవుతుంది.

PCOD ఉన్నవారు పాటించాల్సిన ముఖ్య సూచనలు:

1. ఆహారంలో జాగ్రత్తలు:
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి.
షుగర్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ దూరంగా పెట్టాలి.
ఫలాలు, కూరగాయలు, గ్రీన్ టీ వంటి సహజ ఆహారాలు తీసుకోవాలి.

2. వ్యాయామం తప్పనిసరి:
ప్రతిరోజూ 30-45 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది.
బరువు తగ్గడం వలన ఓవులేషన్ మెరుగుపడుతుంది.

3. మానసిక ఒత్తిడిని తగ్గించండి:
స్ట్రెస్ కూడా హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.
ధ్యానం, సంగీతం, పుస్తకాలు చదవడం వంటి ప్రశాంతమైన పనులు చేయండి.

4. మందుల ద్వారా చికిత్స:
డాక్టర్ సూచన మేరకు హార్మోన్ రెగ్యులేటింగ్ మందులు, ఓవులేషన్ ఇన్‌డ్యూసర్స్ వాడవచ్చు.
కొన్ని సందర్భాల్లో IVF లేదా IUI వంటి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా గర్భం దాల్చవచ్చు.

PCOD ఉన్నప్పుడు గర్భధారణ సమయంలో జాగ్రత్తలు:

PCOD ఉన్న మహిళలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్, హార్మోన్లు, బరువు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలి. రెగ్యులర్ చెకప్‌లు చేయించడం చాలా ముఖ్యం.

PCOD ఉన్నవారికి పిల్లలు పుట్టరని నమ్మకం ఒక అపోహ మాత్రమే. సరైన వైద్య పర్యవేక్షణలో ఉంటే, హార్మోన్లను నియంత్రిస్తే, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే గర్భధారణ సాధ్యమే.

మహిళల్లో PCOD సాధారణమైన సమస్యే కానీ ఆశలు కోల్పోవాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణతో, వైద్య సలహాతో మీరు కూడా తల్లిగా మారవచ్చు.


Post a Comment (0)
Previous Post Next Post