Constipation During Pregnancy: గర్భిణీల్లో మలబద్ధకం సమస్యను ఎలా నివారించాలి?

Constipation During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో మలబద్ధకం (Constipation) ఒకటి. హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, శరీర బరువు పెరగడం, ఐరన్ టాబ్లెట్స్ వాడటం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మలబద్ధకం ఎక్కువైతే పొట్ట నొప్పి, గ్యాస్, అసౌకర్యం, హెమరాయిడ్స్ (పైల్స్) సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమస్యను ముందుగానే అర్థం చేసుకుని నియంత్రించడం చాలా ముఖ్యం.

Constipation During Pregnancy
Constipation During Pregnancy

గర్భిణీల్లో మలబద్ధకం ఎందుకు వస్తుంది?

మలబద్ధకం రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఇవి:

1. హార్మోన్ల మార్పులు: ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువ కావడం వల్ల పేగులు (Intestines) నెమ్మదిగా పని చేస్తాయి. ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

2. ఐరన్ టాబ్లెట్స్: చాలా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఇవి మలబద్ధకాన్ని పెంచే అవకాశం ఉంటుంది.

3. శారీరక కదలికలు తగ్గడం: గర్భధారణలో అలసట, శరీర బరువు పెరగడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఇది మలబద్ధకం పెరగడానికి ఒక ప్రధాన కారణం.

4. తగినంత నీరు తాగకపోవడం: శరీరంలో నీరు తగ్గితే మలం గట్టిపడి బయటకు రావడం కష్టంగా మారుతుంది.

5. పోషకాహారం లోపం: ఫైబర్ ఉన్న ఆహారం తక్కువగా తీసుకుంటే మలబద్ధకం రావడం సహజం.

Also Read: ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

మలబద్ధకాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన మార్గాలు

1. ఎక్కువ నీరు తాగండి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగితే ఆహారం సాఫ్ట్‌గా జీర్ణమై, మల విసర్జన సులభంగా జరుగుతుంది.

2. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోండి. రోజువారీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు చేర్చాలి. జామ, అరటి, ఆపిల్ (with peel), నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. క్యారెట్, బీట్‌రూట్, పాలకూర, దోసకాయ వంటి కూరగాయలు తినాలి. ఓట్స్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ తింటే మంచిది. పప్పులు, శెనగలతో పాటు రోజుకు 25-30 గ్రాములు ఫైబర్ తీసుకోవడం మంచిది.

3. ఉదయం నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. రోజూ 20-30 నిమిషాల తేలికపాటి వాకింగ్ intestines పని వేగాన్ని పెంచుతుంది. డాక్టర్ అనుమతితో ప్రెగ్నెన్సీ safe exercises చేయడం మంచి పద్ధతి.

4. భోజనాన్ని చిన్న భాగాలుగా తీసుకోండి. ఒక్కసారిగా ఎక్కువ తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. రోజుకు 4-5 చిన్న పూటల భోజనం తీసుకోవడం మంచిది.

5. ఐరన్ టాబ్లెట్స్‌ను సరిగ్గా వాడండి. ఐరన్ మలబద్ధకం పెంచుతుంది కనుక ఐరన్ టాబ్లెట్‌ను రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవడం మంచిది. చాలా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్‌తో మాట్లాడి stool softener లేదా ఇంకో రకం ఐరన్ సూచన పొందండి.

6. గ్యాస్, bloating పెంచే ఆహారాలను తగ్గించండి. ఎక్కువగా ఫ్రై చేసిన వంటకాలు, మసాలా పదార్థాలు, బటానీలు, బీన్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించడం మంచిది.

7. ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగితే మల విసర్జన సహజంగా జరుగుతుంది.

8. అవసరమైతే డాక్టర్ సూచించే మందులు వాడండి. సాధారణ laxatives గర్భిణీలకు safe కాదు. కాబట్టి డాక్టర్ సూచించే Stool softeners, Bulk-forming agents (psyllium husk) మాత్రమే వాడాలి.

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
మలబద్ధకం 3-4 రోజులకు పైగా కొనసాగితే,పొట్ట నొప్పి, మల విసర్జన సమయంలో రక్తం రావడం, పైల్స్ సమస్య పెరగడం, వాంతులు వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

గర్భిణీల్లో మలబద్ధకం సాధారణమైన సమస్యే అయినా, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన ఆహారం, నీరు, వ్యాయామం, పాటిస్తే ఈ సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు. అవసరమైతే డాక్టర్ సూచనలు తీసుకోవడం ఉత్తమం.


Post a Comment (0)
Previous Post Next Post