What is PMS: PMS అంటే Premenstrual Syndrome. పీరియడ్స్ రాకముందు 7-10 రోజులు చాలా మహిళలు శరీరం, మనసు, భావోద్వేగాల్లో అనుభవించే మార్పులను PMS అంటారు. ఇది ఒక వ్యాధి కాదు, మహిళల monthly cycleలో జరిగే హార్మోన్ మార్పుల వల్ల సహజంగా వచ్చే పరిస్థితి. కొందరికి స్వల్పంగా, మరికొందరికి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.
![]() |
| What is PMS |
PMS ఎందుకు వస్తుంది?
PMS రావడానికి ప్రధాన కారణం హార్మోన్ల లోపల జరిగే హెచ్చుతగ్గులు. పీరియడ్ సైకిల్‌లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ స్థాయిలు మారుతాయి. ఈ మార్పులు నేరుగా నర్వస్ సిస్టమ్ మరియు బ్రెయిన్‌పై ప్రభావం చూపుతాయి. అందువల్ల మూడ్ మార్పులు, చిరాకు, ఒత్తిడి, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే జీవనశైలి కూడా దీనిపై ప్రభావం చూపుతుంది. స్ట్రెస్, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కాఫీ/జంక్ ఫుడ్, అలాగే థైరాయిడ్ లేదా విటమిన్ లోపాలు PMSని మరింత పెంచుతాయి.
Also Read: ట్యూబెక్టమీ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
PMS సమయంలో కనిపించే లక్షణాలు
PMSలో లక్షణాలు శరీరానికీ, మనసుకీ సంబంధించినవి. కొందరికి శారీరకంగా బ్లోటింగ్, ఛాతీ నొప్పి, తలనొప్పి, శరీరం బరువుగా అనిపించడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. భావోద్వేగంగా చిరాకు, ఏడ్వాలనిపించడం, మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆకలి పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా పీరియడ్స్ మొదలైన తర్వాత తగ్గిపోతాయి.

ఎవరికి PMS ఎక్కువగా వస్తుంది?
హార్మోన్ మార్పులకు బాడీ సెన్సిటివ్‌గా రియాక్ట్ అయ్యే మహిళల్లో PMS ఎక్కువగా ఉంటుంది. అదనంగా స్ట్రెస్ ఎక్కువగా ఉండేవారు, నిద్ర సరిపోని వారు, పొగ తాగే వారు, అలాగే ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో PMS లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
PMSను ఎలా తగ్గించుకోవాలి?
PMSను జీవనశైలి మార్పులతో చాలా వరకు నియంత్రించవచ్చు. రోజూ 30 నిమిషాలు తేలికైన వ్యాయామం చేయడం, తగిన నిద్ర, తక్కువ కాఫీ,తీపి పదార్థాలు తీసుకోవడం, ఎక్కువ నీళ్లు త్రాగడం సహాయపడతాయి. ఒత్తిడి తగ్గించే యోగా, డీప్ బ్రీతింగ్ వంటి పద్ధతులు కూడా ఉపయోగపడతాయి. పీరియడ్స్‌కు ముందు కొద్దిగా సమతుల్యమైన డైట్,పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవడం మంచిది.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
పిరియడ్స్ రాకముందు వచ్చే సమస్యలు రోజువారీ పనులు చేయలేనంతగా ఉంటే, లేదా తీవ్ర భావోద్వేగ మార్పులు, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలి. ఎందుకంటే కొద్దిమందిలో ఇది PMDD (Premenstrual Dysphoric Disorder) గా మారి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది.