Benefits of Egg Freezing: ఇప్పటి కాలంలో చాలామంది మహిళలు తమ కెరీర్, చదువులు, వ్యక్తిగత స్వాతంత్ర్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పెళ్లి లేదా పిల్లల కోసం త్వరపడకుండా, జీవితాన్ని తనదైన రీతిలో ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఒక సమస్య ఏమిటంటే.. వయసు పెరిగేకొద్దీ మహిళల్లో ఎగ్స్ (Eggs) నాణ్యత మరియు సంఖ్య తగ్గిపోతాయి. దీనివల్ల భవిష్యత్తులో గర్భధారణ అవకాశాలు కష్టమవుతాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎగ్ ఫ్రీజింగ్ (Egg Freezing). దీన్ని ఓసైట్ క్రయోప్రిజర్వేషన్ (Oocyte Cryopreservation) అని కూడా అంటారు.
Egg Freezing అంటే ఏమిటి? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆధునిక టెక్నిక్. ఇందులో మహిళల అండాలను (Eggs) ప్రత్యేకమైన మందులు ఇచ్చి అభివృద్ధి చేయించి, ఆ తర్వాత చిన్న ప్రొసీజర్ ద్వారా తీసి, లిక్విడ్ నైట్రోజన్‌లో -196°C ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజ్ చేసి నిల్వ చేస్తారు. అలా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఏళ్ల తరబడి సురక్షితంగా ఉంటాయి. మహిళ భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న తర్వాత లేదా పిల్లలు ప్లాన్ చేసినప్పుడు వాటిని IVF పద్ధతిలో ఉపయోగించి సంతానం పొందవచ్చు.
Also Read: స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం? - Dr. Shashant
ఎవరికి Egg Freezing ఉపయోగపడుతుంది?
1. కెరీర్ పై దృష్టి పెట్టే మహిళలకు: చదువులు, ఉద్యోగం, బిజినెస్ లేదా ఇతర కలలు నెరవేర్చుకోవడానికి పెళ్లి ఆలస్యమవుతుంది. అలాంటి మహిళలు ముందుగానే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే, వయసు పెరిగినా ఆరోగ్యకరమైన గర్భధారణ సాధ్యమవుతుంది.
2. పెళ్లి ఆలస్యంగా ప్లాన్ చేసుకునే వారికి: 30 ఏళ్లు దాటాక ఎగ్ క్వాలిటీ, సంఖ్య తగ్గిపోతుంది. 35 ఏళ్ల తరువాత ఇది మరింత తగ్గిపోతుంది. కాబట్టి పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకునే వారు ముందుగానే ఈ పద్ధతి ఆలోచించవచ్చు.
3. హెల్త్ సమస్యలున్న మహిళలకు: క్యాన్సర్ చికిత్సలు (కీమోథెరపీ, రేడియేషన్) లేదా జన్యు సంబంధ వ్యాధులు ఉన్నవారు భవిష్యత్తులో గర్భం ధరించడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఎగ్ ఫ్రీజింగ్ భవిష్యత్తు కోసం మంచి ఆప్షన్.
4. మెడికల్ ట్రీట్మెంట్స్ చేయించుకునే వారికి: కొన్ని సర్జరీలు, చికిత్సలు గర్భాశయం లేదా అండాశయాల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ఫెర్టిలిటీని కాపాడుకోవచ్చు.
Egg Freezing ప్రయోజనాలు

- ఫెర్టిలిటీ సెక్యూరిటీ - వయసు పెరిగినా కూడా సంతానం కలిగే అవకాశాన్ని కాపాడుతుంది.
- స్వతంత్ర నిర్ణయం - పెళ్లి లేదా పిల్లల కోసం మహిళలు త్వరపడకుండా, తమ ప్లాన్ ప్రకారం జీవించవచ్చు.
- ఆరోగ్యకరమైన ఎగ్స్ - యువ వయసులో ఉన్న ఎగ్స్‌ను ఫ్రీజ్ చేస్తే, భవిష్యత్తులో గర్భధారణ విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువ.
- మానసిక ప్రశాంతత - "వయసు పెరిగిపోయింది, ఇప్పుడు గర్భం రాదేమో" అనే భయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
Dr. Sasi Priya గారి సూచనలు
- ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి సరైన వయసు 25 నుంచి 35 మధ్యలో ఉంటుంది. ఈ వయసులో ఎగ్స్ నాణ్యత చాలా బాగుంటుంది.
- ముందుగానే ప్లాన్ చేసుకోవడం వలన భవిష్యత్తులో IVF లేదా ఇతర చికిత్సల విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ఇది పూర్తిగా సురక్షితమైన ప్రొసీజర్. మహిళ ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదు.
ఇప్పటి మహిళలకు తమ కెరీర్, వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం మధ్య సంతులనం చాలా ముఖ్యం. పిల్లల కోసం త్వరపడకుండా, భవిష్యత్తులో కూడా తల్లిగా మారాలనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ ఒక స్మార్ట్ డెసిషన్. Dr. Sasi Priya గారు చెప్పినట్లుగా “అప్పుడే పెళ్లి, పిల్లలు ఒద్దు అనుకునే అమ్మాయిలు తమ భవిష్యత్తు కోసం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ పరిగణించాలి. ఇది మీ ఫెర్టిలిటీని సురక్షితంగా కాపాడుతుంది.”