Who Needs Sperm Freezing: స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరం? - Dr. Shashant

Who Needs Sperm Freezing: ప్రస్తుతం వైద్యరంగం అభివృద్ధితో సంతానోత్పత్తి చికిత్సలు మరింత అధునాతనంగా మారాయి. అందులో ఒక ముఖ్యమైన సాంకేతికత స్పెర్మ్ ఫ్రీజింగ్ (Sperm Freezing). దీనిని స్పెర్మ్ క్రయోప్రిజర్వేషన్ (Cryopreservation) అని కూడా అంటారు. ఈ ప్రక్రియలో పురుషుల నుండి తీసుకున్న వీర్యకణాలను (Sperms) ప్రత్యేక టెక్నిక్ ద్వారా చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద -196°C వరకు లిక్విడ్ నైట్రోజన్‌లో ఫ్రీజ్ చేసి నిల్వ చేస్తారు. ఆ తర్వాత అవసరమైతే ఏళ్ల తరువాతైనా వాటిని ఉపయోగించి గర్భధారణ సాధించవచ్చు.


స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తారు? కొన్ని పరిస్థితుల్లో భవిష్యత్తులో సంతానం కలిగి ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. అప్పుడు ముందస్తు జాగ్రత్తగా వీర్యకణాలను నిల్వ చేయడం అవసరం అవుతుంది. వీర్యకణాల నాణ్యత తగ్గిపోకుండా కాపాడుకోవడమే స్పెర్మ్ ఫ్రీజింగ్ ప్రధాన ఉద్దేశ్యం.


స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎవరికీ అవసరం అవుతుంది?

1. క్యాన్సర్ చికిత్స పొందేవారికి: క్యాన్సర్ ఉన్న రోగులకు కీమోథెరపీ లేదా రేడియేషన్ చేయాల్సి వస్తుంది. ఇవి వీర్యకణాలను పూర్తిగా దెబ్బతీయవచ్చు. భవిష్యత్తులో పిల్లలు కావాలనుకునే క్యాన్సర్ రోగులు చికిత్స ప్రారంభించే ముందు స్పెర్మ్ ఫ్రీజ్ చేయడం చాలా ముఖ్యం.

2. వయసు పెరిగిన పురుషులకు: వయసు పెరుగుతున్నకొద్దీ స్పెర్మ్ క్వాలిటీ, మొబిలిటీ, జన్యు నాణ్యత తగ్గిపోతుంది. అందువల్ల 35-40 ఏళ్లు దాటిన పురుషులు, భవిష్యత్తులో ఆలస్యంగా వివాహం చేసుకోవాలనుకుంటే లేదా పిల్లలు కావాలనుకుంటే ముందుగానే స్పెర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు.

3. IVF లేదా IUI ట్రీట్మెంట్ చేయించుకునేవారికి: కొన్నిసార్లు IVF లేదా IUI రోజు పురుషుడు సరైన నమూనా ఇవ్వలేకపోవచ్చు. స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్ వల్ల సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ముందుగానే స్పెర్మ్ ఫ్రీజ్ చేసి ఉంచడం ద్వారా ట్రీట్మెంట్ డిలే కాకుండా చూసుకోవచ్చు.

4. జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నవారికి: కొంతమందికి వారసత్వంగా వచ్చే వ్యాధులు లేదా జన్యు సమస్యలు ఉంటాయి. వీరు భవిష్యత్తులో పిల్లలు కనకముందే వీర్యకణాలను ఫ్రీజ్ చేసి, జన్యు పరీక్షలు చేయించి, ఆరోగ్యకరమైన ఎంప్రియోస్ ద్వారా సంతానం పొందవచ్చు.

5. అధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలలో ఉన్నవారికి: సైనికులు, పర్యావరణ రిస్క్ ఉన్న ఉద్యోగాలు (కెమికల్ ఫ్యాక్టరీలు, రేడియేషన్ వర్క్ ప్లేస్‌లు) చేసే పురుషులు వీర్యకణాల నాణ్యత దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా వీరు స్పెర్మ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు.

6. సెర్జరీకి ముందు ఉన్నవారికి: కొంతమందికి వృషణాలపై లేదా ప్రోస్టేట్ గ్రంథి పై శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ వల్ల స్పెర్మ్ ఉత్పత్తి శాశ్వతంగా తగ్గిపోవచ్చు. అప్పుడు ముందుగానే స్పెర్మ్ నిల్వచేయడం అవసరం.

7. తరచుగా ప్రయాణాలు చేసే పురుషులకు: విదేశీ ఉద్యోగాలు లేదా తరచూ ట్రావెల్ చేసే వారు IVF/IUI ట్రీట్మెంట్ కోసం అందుబాటులో లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ముందే స్పెర్మ్ నిల్వ చేసి ఉంచడం సౌకర్యవంతంగా ఉంటుంది.

స్పెర్మ్ ఫ్రీజింగ్ ఎంతకాలం పనిచేస్తుంది? లిక్విడ్ నైట్రోజన్‌లో ఫ్రీజ్ చేసిన స్పెర్మ్స్ ఏళ్ల తరబడి సురక్షితంగా నిల్వ ఉండగలవు. నాణ్యతలో పెద్ద మార్పులు లేకుండా, డిఫ్రాస్ట్ చేసిన తర్వాత విజయవంతంగా గర్భధారణ కోసం ఉపయోగించవచ్చు.

Dr. Shashant గారి సూచనలు:
సంతానం కోసం ఆలస్యంగా ప్లాన్ చేసుకునే వారు ముందుగానే స్పెర్మ్ ఫ్రీజ్ చేయించుకోవాలి.
హెల్త్ ఇష్యూస్ లేదా రిస్క్ ఫాక్టర్స్ ఉన్న పురుషులు తప్పనిసరిగా ఈ టెక్నిక్‌ని పరిగణించాలి.
ఇది పూర్తిగా సురక్షితమైన, నొప్పిలేని మరియు నమ్మకమైన పద్ధతి.

స్పెర్మ్ ఫ్రీజింగ్ అనేది భవిష్యత్తులో సంతానం కావాలని కోరుకునే పురుషులకు ఒక లైఫ్ సేఫింగ్ ఆప్షన్. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు, వయసు పెరిగిన వారు, IVF/IUI ప్రొసీజర్స్ చేయించుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.


Post a Comment (0)
Previous Post Next Post